Site icon vidhaatha

Miarai Trailer | ‘మిరాయ్’ ట్రైల‌ర్‌ విడుదల.. త్రేతాయుగం నాటి ఆయుధం కథ!

Mirai Movie

Miarai Trailer | విధాత : హీరో తేజా సజ్జా(Teja Sajja) ‘హ‌నుమాన్‌'(Hanuman) ఘన విజయ తర్వాత వస్తున్న మరో ఫాంటసీ మూవీ ‘మిరాయ్'(Mirai) నుంచి మేకర్స్ గురువారం ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ‘మిరాయ్’ ఓ విజువల్ వండర్ ట్రీట్ గా ఉండబోతుందన్న సంగతి వెల్లడవ్వడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింతగా అంచనాలు పెరిగాయి. దాదాపుగా 3నిమిషాల ట్రైలర్ లో ”ఈ ”ప్ర‌మాదం ప్ర‌తీ గ్రంధాన్నీ చేరబోతోంది. దాన్ని ఆప‌డానికి నువ్వు మిరాయ్‌ని చేరుకోవాలి”. ”నువ్వు అనుకొంటున్న మ‌నిషీ అడ్ర‌స్సు నేను కాదు”. ”ఈ దునియాలో ఏదీ నీది కాదు భ‌య్యా.. అన్నీ అపేయ్.. ఈ రోజు నీద‌గ్గ‌ర‌, రేపు నా ద‌గ్గ‌ర‌” ”నా గ‌తం.. నా యుద్ధం.. నా ప్ర‌స్తుతం ఊహాతీతం”. ”తొమ్మిది గ్రంధాలూ వాడికి దొరికితే ప‌విత్ర గంగ‌లో పారేది ర‌క్తం..” ”ఇదే చ‌రిత్ర‌… ఇది భ‌విష్య‌త్తు.. ఇదే మిరాయ్‌..” అన్న డైలాగ్ లు సినిమా కథ నేపథ్యంలో సాగుతూ ఆసక్తికరంగా ఉన్నాయి.

హీరో తేజా డ్రాగన్ పక్షితో సాగించే యుద్దం..త్రేతాయుగం నాటి ఆయుధం మిరాయ్ ని సాధించే క్రమంలో శ్రీరాముడి దర్శనం సన్నివేశాలు సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచాయి. మంచు మనోజ్(Manchu Manoj) విలనీ కూడా ఆకట్టుకునేలా కనిపించింది. కార్తిక్‌ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో రూపొందిన మిరాయ్(Mirai) సినిమా తేజా స‌జ్జాకు మ‌రో పాన్ ఇండియా హిట్ గా ఉండబోతుందని టాక్. మిరాయ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌పై టీ.జీ. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ దాదాపు రూ.60 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందించారు. సెప్టెంబ‌రు 12న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రితికా నాయక్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. మంచు మనోజ్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు త‌దిత‌రులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Exit mobile version