Site icon vidhaatha

Sreeleela| తిరుమ‌ల వెంక‌న్నని ద‌ర్శించుకున్న శ్రీలీల‌.. బుగ్గ గిల్లిన థ‌మ‌న్

Sreeleela| టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో శ్రీలీల ఒక‌రు. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో కుర్రాళ్ల మ‌నస్సు ఇట్టే కొల్ల‌గొట్టేస్తుంటుంది. ఈ భామ ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతుంది. అయితే స‌క్సెస్ రేటు కాస్త త‌గ్గింది. ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ భారీ హోప్స్ పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే తాజాగా ఈ భామ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం ఇచ్చి వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ద‌ర్శ‌నం చాలా సంతోషంగా జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేశారు శ్రీలీల‌.

అయితే దేవుడిని దర్శించుకొని బయటకు వస్తున్న సమయంలో సంగీత దర్శకుడు తమన్ ఆలయం లోపలకు వెళుతున్నారు.ఆ స‌మ‌యంలో శ్రీలీలను చూసి ఆగి పలకరించారు. తర్వాత బుగ్గగిల్లి కరచాలనం చేసి వెళ్లిపోయారు. శ్రీలీల ఇటీవల నటించిన భగవంత్ కేసరి, గుంటూరు కారం, స్కంద చిత్రాలకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే శ్రీలీలతో త‌న‌కున్న చ‌నువు కార‌ణంగా థ‌మన్ శ్రీలీల చెంపను మెల్లిగా తాకి అనంతరం ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే ఈ దృశ్యం మీడియా కెమెరాల్లో రికార్డ్ కావ‌డంతో ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతుంది. ఇక దీనిపై నెటిజ‌న్స్ దారుణ‌మైన ట్రోలింగ్ చేస్తున్నారు.

ప‌విత్ర‌మైన గుడిలో ఇదేం ప‌ని అంటూ కొంద‌రు దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. అయిన లైన్‌లో ఉన్న స‌మ‌యంలో అంత ఆగి ప‌ల‌క‌రించుకోవ‌ల్సిన అవ‌స‌రం ఏముంది, అంటూ ఇద్ద‌రిని కూడా దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇష్యూతో ఇద్ద‌రు హాట్ టాపిక్‌గా మారారు. ఇక శ్రీలీల ప్ర‌స్తుతం హీరోయిన్‌గానే కాకుండా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా నాలుగు రూపాయ‌లు వెన‌కేసుకుంటుంది. ఇటీవలే న్యూడ్ స్కిన్ కేర్ హై గ్లేజరిన్ బ్రాండ్‌కు శ్రీలీల ప్రచారకర్తగా ఎంపిక అయిన ఈ భామ పాల ఉత్పత్తులతో తయారు చేసే న్యూడ్ ప్రొడక్ట్స్ తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

Exit mobile version