Tirumala Tirupathi Devasthanam | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భక్తుల నుంచి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. గడచిన 11 నెలల వ్యవధిలో రూ.918.6 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. 2024 నవంబర్ 1వ తేదీ నుంచి 2025 అక్టోబర్ 16వ తేదీ వరకు వచ్చినట్లు పేర్కొంది. భక్తులు, ధాతల నుంచి విరాళాలు సేకరించేందుకు 11 ట్రస్టులను ఏర్పటు చేశారు. వివిధ రూపాల్లో విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. కొందరు బంగారం మరికొందరు చెక్కులు, డీడీలు, వాహనాలు, ఆస్తుల రూపంలో ఇస్తున్నారు.
ఎక్కువ మొత్తం లో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు సమకూరాయి. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టుకే రూ.253 కోట్లు వచ్చాయి. శీఘ్ర దర్శనం సౌలభ్యం ఉండడంతో భక్తులు ఎక్కువగా శ్రీవాణి ట్రస్టు కు విరాళాలు ఇస్తున్నారు. శ్రీ బాలాజీ వరప్రసాదిని పథకం రూ.97.97 కోట్లు, ఎస్వీ ప్రాణదాణ ట్రస్టు రూ.66.53 కోట్లు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్టు రూ.66.53 కోట్లు, ఎస్వీ విద్యా ధ్యాన ట్రస్టు రూ.33.47 కోట్లు, బర్డ్ ట్రస్టు రూ.30.02 కోట్లు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టు రూ.20.46 కోట్లు, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టు రూ.13.87 కోట్లు, ఎస్వీబీసీ ట్రస్టు రూ.6.29 కోట్లు, స్విమ్స్ కు రూ.1.52 కోట్లు సమకూరాయి.