Theatres| ఓటీటీలు వచ్చాక థియేటర్స్‌కి వెళ్లే వారి సంఖ్య తగ్గుతుంది. ఎప్పుడో పెద్ద సినిమాలు వస్తే కాని అప్పుడు థియేటర్స్ కళకళలాడడం లేదు. అయితే చిన్న సినిమాలలో మంచి కంటెంట్ ఉండి, టాక్ మంచిగా వస్తే ఇక ఆ సినిమాల కోసం థియేటర్‌కి వెళుతున్నారు. అయితే ఈ వారం ఏకంగా డజను సినిమాలు థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.వాటిలో ఏ మూవీ హిట్ కొడుతుంది, ఏ మూవీ ఫ్లాప్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ చూస్తే.. ఈ గురువారం (ఆగస్ట్ 1), శుక్రవారం (ఆగస్ట్ 2) ఎన్నో తెలుగు, హిందీ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.
అశ్విన్ బాబు నటించిన శివమ్ భజే మూవీ ఆగస్ట్ 1నే రిలీజ్ కాబోతోంది. మైథాలజీకి క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం రూపొందింది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నటించిన బడ్డీ అనే సినిమా శుక్రవారం (ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 2021లో ఆర్య నటించిన టెడ్డీ మూవీనే కాస్త మార్చి ఈ బడ్డీ తీసుకొస్తున్నారు. నటుడు రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామి కూడా శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అవుతుంది. గత శుక్రవారం (జులై 26) పురుషోత్తముడుతో వచ్చి బోల్తాపడిన అతడు.. ఈసారి ఈ చిత్రంతో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. వరుణ్ సందేశ్ నటించిన విరాజి మూవీ కూడా శుక్రవారమే రిలీజ్ కానుంది.
డైరెక్టర్ విజయ్ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ నటించిన ఉషా పరిణయం మూవీ వీకెండ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.తమిళ విలక్షణ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తూఫాన్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఈ వారంలోనే రానుంది. బిచ్చగాడుతో బంపర్ హిట్ కొట్టిన విజయ్ ఇప్పుడు ఈ చిత్రంతో మరింత అలరించాలని అనుకుంటున్నాడు. ఇవే కాక తెలుగులో అలనాటి రామచంద్రుడు, యావరేజ్ స్టూడెంట్ నాని, లారీలాంటి సినిమాలు కూడా శుక్రవారం (ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. హిందీలో చూస్తే… జాన్వీ కపూర్ నటించిన ఉలఝ్, అజయ్ దేవగన్ నటించిన ఔరే మే కహా దమ్ థా సినిమాలు కూడా ఈ శుక్రవారం థియేటర్స్‌లోకి వచ్చి సందడి చేసేందుకు సిద్ధం అయ్యాయి.