Site icon vidhaatha

Mohan Babu | న‌టుడు మోహ‌న్ బాబు ఇంట్లో భారీ చోరీ.. తిరుప‌తిలో ప‌నిమ‌నిషి అరెస్ట్

Mohan Babu | టాలీవుడ్ న‌టుడు, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు( Mohan Babu ) ఇంట్లో భారీ చోరీ జ‌రిగింది. హైద‌రాబాద్ జ‌ల్‌ప‌ల్లి( jalpally ) లోని మోహ‌న్ బాబు నివాసంలో రూ. 10 ల‌క్ష‌లు చోరీకి గురైన‌ట్లు నిన్న రాచ‌కొండ సీసీ సుధీర్‌బాబు( CP Sudheer babu )కు ఫిర్యాదు చేశారు. మోహ‌న్ బాబు ఫిర్యాదుతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చోరీకి పాల్ప‌డ్డ నాయ‌క్‌ను తిరుప‌తి( Tirupathi )లో రాచ‌కొండ( Rachakonda ) పోలీసులు అరెస్టు చేశారు. నాయ‌క్ గ‌త కొంత‌కాలం నుంచి మోహ‌న్ బాబు ఇంట్లో ప‌ని మ‌నిషిగా ప‌ని చేస్తున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

Exit mobile version