Site icon vidhaatha

Tollywood|మూవీ ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్.. ఆగ‌స్ట్‌లో సినిమాల జాత‌ర‌

Tollywood| ఈ ఏడాది ఫ‌స్టాఫ్ లో మంచి సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అల‌రించాయి. సంక్రాంతి బ‌రిలో నిలిచిన గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం పంచాయి. ఇక ఈ సినిమాల త‌ర్వాత పెద్ద సినిమాల జాడే లేకుండా పోయింది. స‌మ్మ‌ర్ అయితే మ‌రీ బోరింగ్‌గా మారింది. ఇక ఇటీవ‌ల ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి విడుద‌ల కాగా, ఈ మూవీ పెద్ద హిట్ కావ‌డం ఫ్యాన్స్‌ని ఎంతో సంతోషప‌రిచింది. మొన్నటి వరకు థియేటర్స్ లో కల్కి సినిమా ప్ర‌భంజ‌నం న‌డిచింది. క‌ల్కి త‌ర్వాత వ‌చ్చిన బార‌తీయుడు 2 చిత్రం అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది.

ఇక మ‌రో నాలుగు రోజుల‌లో జూలై నెల ముగియ‌నుంది. దీంతో ఆగ‌స్ట్ నెల‌లో వచ్చే సినిమాల‌పై సినీ ప్రేక్ష‌కులు క‌న్నేస్తున్నారు. ఆగ‌స్ట్ నెల‌లో భారీ సినిమాల‌తో పాటు మోస్త‌రు సినిమాలు కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఆగస్టులో ముందుగా రీరిలీజ్ సినిమాలతో థియేటర్స్ క‌ళ‌క‌ళ‌లాడ‌నున్నాయి. ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘ఒక్కడు’ సినిమాను ఒక్కరోజు ముందే స్పెషల్ షో వేయబోతున్నారు. ఇక అనంతరం ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు క్లాసిక్ మూవీ ‘మురారి’ రిలీజ్ కానుంది. ఓ వారం రోజుల తర్వాత ఎనర్జిటిక్ రామ్ పోతినేని,పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమాకి పోటీగా డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా రిలీజ్ కాబోతుంది. వీటితో పాటు ఈ ఆగస్టు 15న పలు భాషల్లో మరో 8 పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ‘ఇంద్ర’ సినిమాను ఆగస్టు 22వ తేదీన గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆగస్టు నెల చివరికి నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ సినిమా థియేట‌ర్స్‌లోకి రానుంది. ఆగ‌స్ట్ 29న ఈ మూవీని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే మేకర్స్ ప్ర‌క‌టించారు. ఇక అదే రోజు నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబోలో తెర‌కెక్కిన సూపర్ హిట్ మూవీ ‘శివ’ రీరిలీజ్ కానుంది. ఇలా ఆగ‌స్ట్ నెల‌లో రీరిలీజ్‌ల‌తో పాటు స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్స్‌లోకి వ‌చ్చి తెగ సంద‌డి చేయ‌నున్నాయి.

Exit mobile version