Vaishnavi Chaitanya:
సినిమాలపై ప్యాషన్ ఉన్నవాళ్లందరు వెంటనే అవకాశాలు దక్కించుకోలేరు. వారికి టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఏదో ఒక రోజు అదృష్టం కొద్ది సినిమా అవకాశం దక్కుతుందని ఎదురు చూసే వాళ్లు ఎందరో ఉన్నారు. అందులో ఒకరు బేబి హీరోయిన్.
సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉండే బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య తనకు అసలు సినిమాలేందుకు? అని అనుకుంది. ఎన్నో ప్రశ్నలు గత ఎనిమిదేళ్లుగా ఆమెని వెంటాయి. దాంతో కాస్త అభద్రతా భావంలోకి వెళ్లిన ఆమె ఏదో ఒక రోజు తనకంటూ ప్రత్యేకమైన రోజు వస్తుందని అనుకుంది. ఆమె అనుకున్నట్టే బేబి సినిమాతో కథానాయికగా మారిన వైష్ణవి చైతన్య తనవైపు వేలెత్తిచూపిన వారికి తగిన సమాధానం చెప్పింది.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వైష్ణవి చైతన్య షార్ట్ ఫిలింస్ చేసింది. టిక్ టాక్ వీడియోలతో కూడా అలరించింది. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ నటించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత అల వైకుంఠపురం, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ఇప్పుడు బేబి సినిమాతో కథానాయికగా మారింది.
వైష్ణవి చైతన్య 2018లో ‘టచ్ చేసి చూడు’ అనే సినిమాతో తొలిసారిగా వెండితెరపై కనిపించింది . ఈ చిత్రంలో రవితేజ రెండో చెల్లెలిగా అలా మెరిసింది.. అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వాలిమై అనే తమిళ్ సినిమాలోను చిన్న క్యారెక్టర్ పోషించింది. అందులోను తన పాత్రకి గుర్తింపు దక్కింది.
సినిమారంగంలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే భావన కొందరిలో ఉంది. కాని వారందరికి వైష్ణవి చైతన్య ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా కథానాయికగా మారేందుకు వైష్ణవి చైతన్య పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదు. తాను ఇప్పటి వరకూ ఎన్నో ఇబ్బందులు చూశానని చెప్పిన వైష్ణవి.. తనకు ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా కూడా నిలబడగలననే ధైర్యం తన గతం ఇచ్చిందని పేర్కొంది.
నిజానికి హీరోయిన్ అవ్వాలనో, ఇండస్ట్రీలో ఏదేదో చేసేయాలనో తనకు లేదని.. సినిమాల్లోకి రావాలని, స్థిరపడాలనే ఆశ మాత్రమే తనకు ఉండేదని చెప్పింది. ‘బేబీ’ సినిమా తనకు మంచి గుర్తింపు ఇచ్చిందని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య. తన తొలి పారితోషికం రూ.700 అని చెప్పిన వైష్ణవి చైతన్య.. ఒక ఈవెంట్ కోసం డ్యాన్స్ చేసే అవకాశం వస్తే.. రోజంతా కష్టపడగా, అప్పుడు ఏడొందల రూపాయలు ఇచ్చారని పేర్కొంది. తన ఫస్ట్ జర్నీ అలా మొదలైందని చెప్పిన ఈ భామ తాను ఇప్పుడు ఎంత సంపాదించినా తన ఫస్ట్ రెమ్యునరేషన్ మాత్రం చాలా స్పెషల్ అని అంటుంది.
ఇక వైష్ణవి చైతన్య నటించిన బేబి చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుండగా, ఈ సినిమా కోసం వైష్ణవి చైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే విషయం కూడా ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. చిత్రంలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండకు రూ.80 లక్షలు రెమ్యూనరేషన్ ఇవ్వగా, హీరోయిన్‌గా చేసిన వైష్ణవికి రూ.30 లక్షలు.. సెకండ్ హీరోగా చేసిన విరాజ్‌కు రూ.20 లక్షలు ఇచ్చారని ఓ టాక్ నడుస్తుంది.
బేబి సినిమా హిట్ తో వైష్ణవి క్రేజ్ విపరీతంగా పెరగడంతో ఈ అమ్మడు తన తదుపరి సినిమాకి భారీగా డిమాండ్ చేస్తుందని టాక్. రామ్- పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ అనే చిత్రం రూపొందు తుండగా, ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం వైష్ణవిని సంప్రదించినట్టు టాక్. ఇందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఏదేమైన ఈ అమ్మడు రానున్న రోజులలో ఆచితూచి ప్రాజెక్టులు చేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగి తెలుగు వాళ్లు కాలర్ ఎత్తుకునేలా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.