Site icon vidhaatha

Vijay Devarakonda| పేరు మార్చుకోబోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌… కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Devarakonda| ఇటీవ‌ల కొంద‌రు హీరోల‌కి అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. ఎంత క‌ష్ట‌ప‌డి సినిమాలు చేసిన స‌రైన స‌క్సెస్ రావ‌డం లేదు. దాంతో స్క్రీన్ నేమ్ మార్చుకునే ప్ర‌యత్నం చేస్తున్నారు. ఆ మ‌ధ్య సాయి ధ‌ర‌మ్ తేజ్ రెండు సార్లు పేరు మార్చుకోవ‌డం మ‌నం చూశాం. తన స్క్రీన్ నేమ్‌లో ధరమ్ తీసేసి సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. ఆ త‌ర్వాత సాయి దుర్గ తేజ్ అని మార్చుకున్నట్లు తెలిపాడు. తన తల్లి పేరు అయిన ‘దుర్గ’ను తన పేరులో యాడ్ చేసుకున్నట్లు వివరించాడు. ఇక ఇప్పుడు రౌడీ బాయ్ విజయ్ దేవ‌ర‌కొండ కూడా త‌న పేరుని మార్చుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తుంది. పేరు మార్పు త‌న‌కి ఇష్టం లేక‌పోయిన త‌న త‌ల్లి కోసం మార్చుకునేందుకు సిద్ధ‌మయ్యాడ‌ట‌.

అర్జున్ రెడ్డి సినిమాతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇటీవ‌లి కాలంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నా కూడా ఆయ‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. విజయ్ దేవరకొండ అంటే ఇప్పటికీ పడిచచ్చిపోయే అభిమానులు ఎంద‌రో ఉన్నారు. గీత గోవిందం తరువాత విజయ్ కు సాలిడ్ హిట్ పడిందే లేదు. టాక్సీవాలా చిత్రం ఓకే అనిపించిన ఆ చిత్రం విజ‌య్ కెరీర్‌కి పెద్ద‌గా ఉప‌యోగ‌పడింది లేదు. లైగ‌ర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేసిన కూడా అది దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. ఇక ఆతరువాత వచ్చిన ఖుషి కాని, రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కాని విజ‌య్ దేవ‌ర‌కొండ స‌త్తాకి త‌గ్గ‌ట్టు హిట్ అందుకోలేక‌పోయాయి.

విజ‌య్ దేవ‌రకొండ ఎన్ని ప్ర‌యోగాలు చేసిన మంచి స‌క్సెస్ అయితే రావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే విజయ్ గురించి ఆలోచించిన వారి పేరెంట్స్.. విజయ్ జాతకం చూపించారట. దాంతో పేరులో మార్పులు చేసుకోవాలి అని సూచించార‌ట‌. అయితే త‌న‌కు ఇష్టం లేక‌పోయిన స‌రే విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న త‌ల్లి కోసం పేరు మార్చుకునేందుకు డిసైడ్ అయ్యాడ‌ట‌. విజ‌య్‌కి త‌న త‌ల్లి అంటే చాలా ఇష్టం. ఆమె నిర్ణ‌యాన్ని కాద‌న‌లేక విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version