Site icon vidhaatha

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి విపరీత‌మైన కోపం తెచ్చిన అభిమాని.. ఏకంగా చేయి లేపాడుగా..!

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఈ మ‌ధ్య పెద్ద‌గా స‌క్సెస్‌లు లేక‌పోయిన ఆయ‌న క్రేజ్ మాత్రం ఏమి త‌గ్గ‌డం లేదు. చివ‌రిగా లైగ‌ర్ చిత్రంతో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాగూర్‌ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీ ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుంది. ఇందులో లవ్, ఫైట్స్‌, కామెడీ, ఎమోషన్‌ ఇలా అన్ని సమపాళ్ళలో ఉంటాయ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఇక ఈ మూవీని ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌నుండ‌గా, జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.

తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌లువురు అభిమానులని క‌లిసి వారితో ఫొటోలు దిగాడు. అయితే ఓ అభిమాని విజయ్ ఫొటోని పేపర్ పై చిత్రించి దాన్ని ఫ్రేమ్ కట్టించి దేవరకొండకు ఇచ్చాడు. ఫొటో ఫ్రేమ్ ఇస్తూ ఆ అభిమాని ఫొటో దిగాడు. ఆ త‌ర్వాత అత‌ను వెళుతున్న స‌మ‌యంలో వెన‌క్కి పిలిచి కొట్ట‌బోయాడు.అందుకు కార‌ణం ఏంటంటే.. ఆ అభిమాని విజ‌య్ ఫొటోని ర‌క్తంతో చిత్రించాడ‌ట‌. విష‌యం తెలుసుకున్న రౌడీ బాయ్ కోపోద్రిక్తుడై అలాంటి ప‌నులు మ‌రోసారి చేయోద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. అరేయ్ మెంటల్ ఇలాంటి పనులు చెయ్యొద్దని హెచ్చరించాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండ‌గా, విజయ్ దేవరకొండ ఫ్యాన్ పై చూపించిన ప్రేమకు అందరు ఫిదా అవుతున్నారు.

అభిమానుల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఫ్యామిలీ స్టార్ మూవీ మంచి హిట్ అందించాల‌ని వారు కోరుకుంటున్నారు.ఇక విజ‌య్ న‌టించిన ఫ్యామిలీ స్టార్ చిత్రంలో మృణాల్ థాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్, పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. సినిమాని పెద్ద హిట్ చేయాల‌ని హీరోహీరోయిన్లతో పాటు దర్శక, నిర్మాతలు కూడా గ్రూపుగా ఓసారి, సెపరేట్ గా ఓసారి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీపై అంచ‌నాలు రెట్టింపు చేస్తున్నారు.

Exit mobile version