Site icon vidhaatha

Vijayalakshmi| ద‌ర్శ‌న్ భార్య ప‌విత్ర గౌడ కాదు.. నేనే అస‌లైన భార్య‌ని అంటూ పోలీసుల‌కి విజ‌య‌ల‌క్ష్మీ లేఖ‌

Vijayalakshmi| ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గ‌త కొద్ది రోజులుగా తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. రేణుకా స్వామి హ‌త్య త‌ర్వాత ఇత‌ను జాతీయ స్థాయిలో కూడా హాట్ టాపిక్‌గా మారాడు. రోజు రోజుకి అత‌ని కేసులో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. అయితే రీసెంట్‌గా పోలీసు కమిషనర్ దయానంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పవిత్ర గౌడ దర్శన్ భార్య’ అని మీడియాకు వెల్లడించారు. దీంతో దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్‌కు ప్రత్యేక లేఖ రాసుకొచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ ద‌ర్శ‌న్, ప‌విత్ర గౌడ ఇద్ద‌రు స‌న్నిహితంగా ఉంటున్నార‌న్న విష‌యం అంద‌రికి తెలుసు, కాక‌పోతే ఆమె ద‌ర్శ‌న్ భార్య కాదు అంటూ విజ‌యల‌క్ష్మీ పేర్కొంది.

ఈ విషయమై పోలీసు రికార్డుల్లో సరైన సమాచారం ఉండాలంటూ విజ‌య‌ల‌క్ష్మీ కోరింది. ఇక లేఖ‌లో ద‌ర్శ‌న్ భార్య ప‌విత్ర గౌడ అని మీరు త‌ప్పుగా చెప్పార‌ని, దీంతో రాష్ట్ర హోంమంత్రులతో పాటు జాతీయ మీడియా కూడా ఇదే మాట చెబుతుంద‌ని ఆమె పేర్కొంది. రేణుకా స్వామి హ‌త్య కేసులో ద‌ర్శన్ దంప‌తులు అరెస్ట్ అయ్యార‌ని క‌థనాలు వ‌స్తుండ‌డంతో నాకు, నా కొడుకు వినేష్‌కి భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు ఎదుర‌య‌యే అవ‌కాశం ఉంటుంద‌ని తెలియ‌జేసింది. ప‌విత్ర గౌడ‌కి సంజయ్ సింగ్‌తో వివాహం అయింది. వారికి ఒక కూతురు ఉంది. ఈ విష‌యాల‌న్నీ కూడా పోలీస్ రికార్డ్‌ల‌లో స్ప‌ష్టంగా ఉండాలంటూ ఆమె చెప్పుకొచ్చింది.

అంతా క్లియ‌ర్‌గా ఉంటే భ‌విష్య‌త్‌లో ఎవ‌రికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యే స‌మ‌స్య ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. న్యాయ వ్య‌వ‌స్థ‌పై నాకు అపార‌మైన న‌మ్మ‌కం ఉంది. ఈ విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకొని పోతుంది. ప‌విత్ర గౌడ నా భ‌ర్త స్నేహితురాలు మాత్ర‌మే, ఆమె భార్య కాద‌నే విష‌యం తెలుసుకోండి. దర్శ‌న్‌తో నాకు చ‌ట్ట‌బ‌ద్ధంగా వివాహం జ‌రిగింది. 2003 మే 19న ధర్మస్థలలో మా వివాహం జరిగింది అని విజయలక్ష్మి లేఖలో తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే భార్య విజయలక్ష్మిపై ద‌ర్శ‌న్ పలుసార్లు చేయి చేసుకుని, దూషించినా, భర్త తరఫున వాదించేందుకు ఆమే ప్రస్తుతం న్యాయవాదిని ఏర్పాటు చేయడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇక ఆమె తన పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో దర్శన్‌ చిత్రాలను తొలగించారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండిపోయారు.

Exit mobile version