రేపటి ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో ఆగస్టు 10న జరగనున్న ‘వార్ 2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి. డైవర్షన్లు, పార్కింగ్‌ సౌకర్యాలు, పోలీసుల సూచనలు ఇవిగో.

హైదరాబాద్‌: ఆగస్టు 10, ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు యూసుఫ్‌గూడా పోలీస్‌ లైన్స్‌లో జరగనున్న వార్ 2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు  అమలు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, రాకపోకల ఇబ్బందులు నివారించేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు దారిమళ్లింపులు సూచించారు.

రహదారి మళ్లింపులు:

పార్కింగ్సౌకర్యాలు:
సాధారణ ప్రజల కోసం మెట్రో పార్కింగ్‌ (జానక్కమ్మతోట 1 & 2), యూసుఫ్‌గూడా, సవేరా ఫంక్షన్‌ హాల్‌, మహమూద్‌ ఫంక్షన్‌ హాల్‌లలో నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ 9010203626కు కాల్‌ చేయవచ్చని, తాజా ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ కోసం సోషల్‌ మీడియాలో @Hyderabad Traffic Police (Facebook) మరియు @HYDTP (Twitter) ఫాలో అవ్వాలని పోలీసులు సూచించారు.