సినిమాలు త‌గ్గించిన అనుష్క ఇప్పుడు రాజ‌కీయాల‌లో స‌త్తా చాటాలని అనుకుంటుందా?

అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసింది. హీరోల స‌ర‌స‌న న‌టించ‌డ‌మే కాదు లేడి ఓరియెంట్ చిత్రాలు కూడా చేసి భ‌ళా అనిపించుకుంది. అనుష్క కెరియ‌ర్‌లో అరుంధతి, బాహుబలి, భాగమతి, నిశ్శబ్ధం లాంటి సినిమాలు ఆమె క్రేజ్‌ని అమాంతం పెంచేలా చేశాయి. సైజ్ జీరో ముందు వరకు వ‌రుస సినిమాల‌తో బాగానే సంద‌డి చేసిన అనుష్క ఈ సినిమా త‌ర్వాత బాగా త‌గ్గించేసింది. సైజ్ జీరో చిత్రం కోసం బాగా లావైంది అనుష్క‌. ఇప్పుడు మున‌ప‌టి లుక్ కోసం ఎంతగానో ప్ర‌య‌త్నిస్తుంది. కాని అది కుద‌రడం లేదు. దాంతో సినిమాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తుంది.

  • Publish Date - March 30, 2024 / 07:10 AM IST

సినిమా అవ‌కాశాలు కాస్త త‌గ్గ‌డంతో అనుష్క శెట్టి పాలిటిక్స్‌లో అడుగుపెట్టాల‌ని డిసైడ్ అయిందట‌. సినిమాకి, రాజ‌కీయాల‌కి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇప్ప‌టికే చాలా మంది న‌టీన‌టులు సినిమాలు చేస్తూనే రాజకీయాల‌లో రాణిస్తున్నారు. కొంద‌రు స్టార్స్ అయితే ఏకంగా పార్టీలే పెట్టేస్తున్నారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే జ‌న‌సేన అనే పార్టీని స్థాపించి ఆంధ్రా ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇక రీసెంట్‌గా త‌మిళ హీరో విజ‌య్ విక్టరీ కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026 లో పోటీ కూడా చేయబోతున్న‌ట్టు తెలిపారు.

అయితే ఇప్పుడు అనుష్క టైం వ‌చ్చింద‌ట‌. ఆమె పార్టీ పెట్ట‌డం లేదు కాని ఏదో ఒక పార్టీలో జాయిన్ అయి పోటీ చేయాల‌ని అనుకుంటుంద‌ట‌. అయితే ఆమె ఏ పార్టీలో చేరతారు.. పోటీ చేస్తారా లేదా అనే విషయంపై మాత్రం అనే ఊహాగానాలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం జ‌న‌సేనలోకి ఆమె ఎంట్రీ ఉంటుంద‌ని టాక్ గ‌ట్టిగా వినిపిస్తుంది. న‌గ‌రి నుండి అనుష్క‌ని దింపే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ చేస్తున్న‌ట్టు టాక్. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో తమిళ, కన్నడ ప్రభావిత జనాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో అక్క‌డ రోజాకి పోటీగా అనుష్క‌ని దింపే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని, ఈ వార్త సోషల్ మీడియాలో మాత్రం తెగ వైర‌ల్ అవుతుంది.

Latest News