Yadamma Raju| పటాస్ జబర్దస్త్ వంటి కామెడీ షో ల ద్వారా ఎంతోమంది కమెడియన్లు సినీ పరిశ్రమకి పరిచయమైన విషయం తెలిసిందే. వారిలో ఒకరు యాదమ్మ రాజు . కమెడీయన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ లో కూడా వెరైటీ వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తుంటాయి. అయితే ఈ మధ్య పలు సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకున్నాడు. పలు సినిమాలలో కీలక పాత్రలు పోషించి మెప్పించాడు.ఇటీవల యాదమ్మ రాజు అరెస్ట్ అయ్యారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యాదమ్మ రాజు అరెస్ట్ అయ్యాడని, 14 రోజులపాటు రిమాండ్ విధించారని జోరుగా ప్రచారాలు సాగాయి. అయితే అసలు విషయం ఏంటంటే.. అది సినిమా ప్రమోషన్ లో ఒక భాగం. యాదమ్మ రాజు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతుండగా,ఆ మూవీ ప్రమోషన్ కోసం అరెస్ట్ అయినట్టు వీడియోని వైరల్ చేశారు. తన ఆస్తిని తాను సాధించుకోవడం కోసం యాదమ్మ రాజు తన స్నేహితుడితో వెంట్రుకలను సేకరించడం అనే స్టోరీ లైన్‌తో ఆ మూవీ రూపొందుతుందట.ఇలా మొత్తానికి అతని కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ఇక పర్సనల్ లైఫ్ చూస్తే.. యాదమ్మ రాజు ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని వివాహం చేసుకున్నాడు.
ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్న ఈ జంట ఇప్పుడు శుభవార్త చెప్పారు. స్టెల్లాతో కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన యాదమ్మ రాజు.. ఎనిమిదేళ్ల అపురూపమైన ప్రేమ, ఏడాదిన్నర వైవాహిక బంధం, ఊహించని సవాళ్లు, నవ్వులు, కన్నీళ్లు.. ఇలా జీవితంలోని ప్రతిక్షణం మమ్నల్ని చాలా దగ్గర చేశాడు. ఇప్పుడు మా బంధం మరింత బలపడింది. మా కుటుంబంలోకి మరొకరు వస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకి ధన్యవాదలు అంటూ యాదమ్మ రాజు, స్టెల్లా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఇక ఈ జంటకి ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.