విధాత, నల్లగొండ : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రూ.35 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. మరో రెండు సెక్షన్ల కింద నిందితుడికి మరో 2 సంవత్సరాల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2016లో చండూర్ పీఎస్ పరిధిలోని ధోనిపాములలో 11ఏళ్ల బాలికపై తిప్పర్తి యాదయ్య అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు సరైన సాక్ష్యాలు సమర్పించడంతో నిందితుడికి కోర్టు శిక్షను ఖరారు చేసింది.
నల్లగొండ పోక్సో కోర్టు ఇటీవల దళిత మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూం అనే నిందితుడికి 51ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతకుముందు ఓ మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన మరో నిందితుడికి పోక్సో కోర్టు ఉరిశిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది.