Kishkindha Rajyam | రామాయణకాలం నాటి కిష్కింద తెలుగువారిదేనా..? ఈ రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా?

Kishkindha Rajyam | రామాయణంలో కిష్కింద గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. కిష్కింద రాజ్యానికి వాలి రాజుగా ఉండేవాడు. ఒకానొక సందర్భంగా వాలి అతని సోదరుడు సుగ్రీవుడికి మధ్య వైరం ఏర్పడుతుంది. దాంతో వాలి రాజ్యం నుంచి సుగ్రీవుడిని వెళ్లగొడతాడు. దాంతో సుగ్రీవుడు రుష్యశృంగ పర్వతంపై తలదాచుకునేవాడు. సుగ్రీవుడికి హనుమాన్‌ మంత్రిగా ఉండేవాడు. అదే సమయంలో సీతాదేవి జాడ వెతుకుతూ రామలక్ష్మణులను హనుమంతుడు చూడడం.. ఆ తర్వాత వాలిని సంహరించి.. సుగ్రీవుడిని రాజుగా నియమించడం.. ఈ కథ అందరికీ తెలిసిందే.

  • Publish Date - April 23, 2024 / 07:57 AM IST

Kishkindha Rajyam | రామాయణంలో కిష్కింద గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. కిష్కింద రాజ్యానికి వాలి రాజుగా ఉండేవాడు. ఒకానొక సందర్భంగా వాలి అతని సోదరుడు సుగ్రీవుడికి మధ్య వైరం ఏర్పడుతుంది. దాంతో వాలి రాజ్యం నుంచి సుగ్రీవుడిని వెళ్లగొడతాడు. దాంతో సుగ్రీవుడు రుష్యశృంగ పర్వతంపై తలదాచుకునేవాడు. సుగ్రీవుడికి హనుమాన్‌ మంత్రిగా ఉండేవాడు. అదే సమయంలో సీతాదేవి జాడ వెతుకుతూ రామలక్ష్మణులను హనుమంతుడు చూడడం.. ఆ తర్వాత వాలిని సంహరించి.. సుగ్రీవుడిని రాజుగా నియమించడం.. ఈ కథ అందరికీ తెలిసిందే. అయితే, రామాయణ కాలం నాటి కిష్కింద ప్రస్తుత కర్ణాటకలోనే ఉందని చెబుతారు. రుష్యమూక పర్వతం, సుగ్రీవుడు సీతమ్మ నగలను భద్రపరిచిన గుహ, వాలి దహనమైన చోటు, హనుమంతుడు విశ్రమించిన ఈ ఘటనలన్నీ హింపీ చుట్టపక్కలనే జరిగాయని.. స్థానికులు పలు క్షేత్రాలను దర్శిస్తూ వస్తున్నారు. ఈ క్షేత్రాలన్నీ బళ్లారి, కొప్పాల్‌ జిల్లాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి.

ఈ రెండు జిల్లాల్లో తెలుగువారే ఎక్కువ నివసిస్తుంటారు. ఇప్పటికీ అక్కడ తెలుగువారు 50శాతం వరకు కనిపిస్తారు. అందుకే ఇవన్నీ గతంలో తెలుగువారు నివసించిన ప్రాంతాలే అనే వాదనలున్నాయి. విజయనగర రాజులు సైతం తెలుగువారేననీ, అందుకే వారు తెలుగువారికి దగ్గరలో ఉన్న హంపీనే తమ రాజధానిగా నిర్మించుకున్నారన్న వాదనలూ లేకపోలేదు. తెలుగుమీద శ్రీకృష్ణదేవరాయలకు ఉన్న అభిమానం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తుంది. పలువురు పండితులు సుగ్రీవుడు తెలుగువాడేనని.. కిష్కింత రాజ్యం తెలుగువారు నివసించే ప్రదేశమని వాదిస్తూ వస్తుంటారు. తెలుగువారిలో ఒక భిన్నమైన తెగనే వానరులుగా చిత్రీకరించారని పేర్కొంటారు. ఈ వాదనలు ఎలా ఉన్నా.. ఇక నాటి కిష్కిందనే నేడు ఆనెగొందిగా పిలుస్తున్నారు. బళ్ళారి సమీపంలో హాస్పేట్‌కు సమీపంలో ఈ చారిత్రక ప్రదేశం ఉంది. దీనికి సమీపంలో అంజనాద్రిపై ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఆనెగొంది అంటే కన్నడం లో ‘ఏనుగుల మడుగ’ అని అర్థం. ఇక్కడే ఏనుగులు విశ్రాంతి తీసుకునేవి. కృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యంలో దీనికి ప్రాధాన్యం ఉన్నది. తుంగ భద్రాతీరంలో కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలో ఆనెగొంది ఉన్నది. ‘ది కిష్కింధ ట్రస్ట్’ ఆధ్వర్యంలో టూరిజం డిపార్ట్‌మెంట్‌ ఆనెగొందిని రోల్ మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దింది.

ఇక్కడ దర్శించాల్సిన ముఖ్య ప్రదేశాల్లో ముందుగా చెప్పుకోదగినది ‘నవ బృందావనం’. తుంగభద్రా నదిలో ఉన్న చిన్న ద్వీపంలో ఉన్నది. మధ్వాచార్య మతానికి చెందిన ప్రసిద్ధ యోగులకు చెందిన తొమ్మిది బృందావనాలు అంటే.. సమాధులున్నాయి. ఆనెగొంది దగ్గర నది దాటి నవ బృందావనం చేరుకోవచ్చు. లేకపోతే హంపీ గుండా చేరుకోవచ్చు. పవిత్రమైన ఈ మధ్వాచార్యుల బృందావనాలను భక్తులు భక్తీ ప్రపత్తులతో దర్శించి తరిస్తారు. అలాగే, ‘నింబవనం’ కూడా దరర్శనీయమైన ప్రాంతం. ఇక్కడే వానరవీరుడు వాలిని దహనం చేసిన చోటు. ఆయన శరీర చితాభస్మం పెద్దకుప్పగా కనిపించి ఆశ్చర్యమేస్తుంది. మరొకటి ఆర్కలాజికల్ మ్యూజియం. ఇందులో విజయనగర సామ్రాజ్యానికి చెందిన అనేక వస్తువులు భద్రపరచారు. అ౦జనాద్రిపై ఆంజనేయ స్వామి దేవాలయం చూసి స్వామి జన్మించిన ప్రదేశాన్ని దర్శించి పునీతులవుతారు. ఇక్కడే ‘ఏడు తలల సర్పం’ ఆరాధనీయంగా కనిపిస్తుంది. ఇక్కడ దర్శనీయ ప్రాంతాల్లో పంపా సరోవరం, లక్ష్మీ ఆలయం, గగన్‌ ప్యాలెస్‌, ఆనెగుంది పోర్ట్‌, కృష్ణదేవరాయల సమాధి, నవ బృందావనం, గణేశ్‌ ఆలయం, రంగనాథ స్వామి ఆలయం, జైన్ ఆలయం, గరుడ స్తంభం, శివాలయం, కిష్కిందకాండ బ్రిడ్జి, అంజనాద్రి పర్వతం, తారా పర్వతంపై వీరభద్ర స్వామి ఆలయం ఉన్నాయి.

Latest News