Site icon vidhaatha

Horoscope | జూన్ 18, బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి చేప‌ట్టిన ప్ర‌తి ప‌నిలోనూ విజ‌య‌మే..!

మేషం (Aries)

ఈ రాశి వారికి అంతా శుభ‌మే జ‌రుగుతుంది. త‌మ వ్యాపారాల‌లో ఆర్థిక వృద్ధి సాధిస్తారు. జీవితంలో కొత్త ప‌ని ప్రారంభించేందుకు ఇది అనుకూల స‌మ‌యం. నూత‌నంగా వాహ‌నాలు కొనే ఛాన్స్ ఉంది. గౌర‌వం, ఖ్యాతి పెరుగుతుంది. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది.

వృషభం (Taurus)

ఈ రాశివారికి ప్ర‌తికూల ప‌రిస్థితులు లేవు. వ్యాపారుల‌కు అద్భుత‌మైన రోజు. కొనుగోళ్లు, అమ్మ‌కాలు జోరందుకోవ‌డంతో.. విశేష‌మైన ఆర్థిక లాభాలు గ‌డిస్తారు. కుటుంబంలో సంతోష‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు.

మిథునం (Gemini)

ఈ రాశివారు ఇవాళ త‌మ నైపుణ్యంపైనే ఆధార‌ప‌డాలి. సొంత నైపుణ్యంతోనే అభివృద్ధి సాధిస్తారు. వివాదాల‌కు దూరంగా ఉంటే బెట‌ర్. ప్ర‌యాణాల్లో అల‌ర్ట్‌గా ఉండాలి. ఉద్యోగుల‌కు తోటి ఉద్యోగుల స‌హ‌కారం లోపిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతాయి.

కర్కాటకం (Cancer)

ఈ రాశివారికి ఇవాళ మిశ్ర‌మ ఫ‌లితాలు ఉన్నాయి. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించ‌డం మేలు. ప్ర‌యాణాలు వాయిదా వేస్తే బెట‌ర్. ముఖ్య‌మైన ప‌నుల్లో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రిస్తే విజ‌యం సిద్ధిస్తుంది. స‌న్నిహితుల‌తో సున్నితంగా మెల‌గండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి అనుకూల స‌మ‌యం న‌డుస్తోంది. అన్ని ప‌నులు ఆటంకం లేకుండా పూర్త‌వుతాయి. అంచ‌నాల‌కు మించి ధ‌న‌లాభాలు ఉంటాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. జీవిత భాగస్వామితో విలువైన సమయం గడుపుతారు.

కన్య (Virgo)

క‌న్యారాశి వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ఆనందంగా గ‌డుపుతారు. వ్యాపారంలో విశేష‌మైన లాభాలు పొందుతారు. కుటుంబ స‌భ్యుల‌తో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. షేర్ మార్కెట్లు, స్థిరాస్తి పెట్టుబడులకు ఇది మంచి రోజు. దీర్ఖకాలంలో దీని వల్ల అత్యధిక ప్రయోజనాలు, లాభాలు అందుకుంటారు. అనుకున్న పనులు నెరవేరడంతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలను మనస్ఫూర్తిగా ఆహ్వానించండి.

వృశ్చికం (Scorpio)

ఈ రాశివారికి శుభ స‌మ‌యం నడుస్తోంది. ఉద్యోగ‌, వ్యాపారాల‌లో ఆశించిన ఫ‌లితాలు అందుకుంటారు. ఇక ఓ వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావ‌ర‌ణం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో ప‌దోన్న‌తులు, జీతాలు పెరిగే అవ‌కాశం ఉంది.

ధనుస్సు (Sagittarius)

ఈ రాశివారికి మిశ్ర‌మ ఫ‌లితాలు ఉన్నాయి. ప‌ని చేసే ప్ర‌దేశంలో ఆటంకాలు ఏర్ప‌డుతాయి. కానీ మీ మ‌నోధైర్య‌మే మీకు ప్రేర‌ణ‌గా నిలుస్తుంది. ప్ర‌యాణాల్లో ఆటంకాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి వాయిదా వేసుకోవ‌డం బెట‌ర్. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగేయండి. జీవిత భాగ‌స్వామితో అనుబంధం బ‌ల‌ప‌డుతుంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ముందు చూపుతో ఉండడం మంచిది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో తీసుకునే కీలక నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. మనోధైర్యంతో వృత్తి ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. లాభాలు తగ్గుతాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధించడానికి మీ శక్తియుక్తులను పూర్తిగా వినియోగించండి. కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో వాగ్వివాదాలకు అవకాశం ఉంది. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం అవసరం. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు.

Exit mobile version