Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగుల‌కు స్థాన చ‌ల‌నం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. నిరాశ వీడి ఉత్సాహంతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులు పెరగడం కొంత ఒత్తిడిని కలిగిస్తుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల అండదండలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధన ధాన్య వృద్ధి ఉంది. సమాజంలో గౌరవ సత్కారాలు అందుకుంటారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సజావుగా సాగుతాయి. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. కుటుంబంలో జరిగే శుభకార్యాల్లో బంధు మిత్రులతో సంతోషంగా, ఉత్సాహంగా గడుపుతారు. నూతన వాహన యోగం ఉంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తి, పట్టుదలతో ఉద్యోగ వ్యాపారాలలో సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. కీలక వ్యవహారాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థానం లభిస్తుంది. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనఃసౌఖ్యం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం కొనసాగుతోంది. వృత్తి పరంగా నిష్ణాతులైన వ్యక్తులను కలుసుకుంటారు. కొత్త అవకాశాలు అందుకుంటారు. కాలం ఉత్సాహంగా, ఆనందంగా గడుస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థికయోగం శుభప్రదం. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. ఒక వ్యవహారంలో నిందలు పడాల్సి వస్తుంది. కోపావేశాలు అదుపులో వుంచుకోండి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలతో ప్రశాంతత దూరమవుతుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేసినా కృషికి తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త వహించండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. తీర్ధయాత్రలతో ప్రశాంతత పొందుతారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనుల్లో విజయాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. స్దాన చలనం సూచన కూడా ఉంది. కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యప్రాప్తి, కీర్తి చేకూరుతాయి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయం. లాభాలు, పెట్టుబడులు పెరుగుతాయి. షేర్ మార్కెట్ పెట్టుబడులు ఊహించని లాభాలు అందిస్తాయి. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా ఈ రోజు చాలా అద్బుతమైన రోజు. పెట్టుబడులు అధిక లాభాలను అందిస్తాయి. ఉద్యోగులు తమ ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ వచ్చే అవకాశం వుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.