మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రారంభించిన పనుల్లో స్వల్ప ఆటంకాలున్నప్పటికీ చివరకు మంచి ఫలితాలు రాబట్టుతారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనుకోకుండా ధనసంపదలు కలిసి వస్తాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలు విజయవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థికలాభాలతో పాటు గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోండి. రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. పనిప్రదేశంలో వివాదాలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది. అందరినీ కలుపుకొని ముందుకు పోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. తారాబలం బాగోలేదు కాబట్టి ప్రయాణం వాయిదా వెయ్యండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు రాకుండా జాగ్రత్త పడండి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలు సమర్ధవంతంగా అధిగమిస్తారు. పట్టుదలతో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్ఠమైన సమయం నడుస్తోంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. వృత్తి పరంగా అందిన శుభవార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. సమాజంలో కీర్తి, గౌరవం పెరుగుతాయి. ధనధాన్య లాభాలున్నాయి. మొహమాటంతో ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. ఆర్థికంగా మేలైన సమయం. ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మాట తీరుతో చిక్కుల్లో పడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అదృష్టయోగం నడుస్తోంది. ప్రారంభించిన పనుల్లో స్వల్ప ప్రయత్నంతోనే విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంగారు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టుతారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా మంచి యోగం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఉన్నతాధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది.
