Hair Cutting | జుట్టు( Hair ) మనిషికి అందాన్నిస్తుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా పెరిగినప్పుడు చికాకుగా కూడా ఉంటుంది. ఇలా జుట్టుతో చికాకు పడేవారు.. ఎప్పుడంటే ఎప్పుడు కటింగ్( Hair Cutting ) చేయించుకుంటుంటారు. అయితే చాలా మంది ఆదివారాల్లోనే( Sunday ) కటింగ్ చేయించుకుంటారు. ఎందుకంటే ఆ రోజు సెలవు దినం కాబట్టి.. సమయం ఉంటుందని చెప్పి.
కానీ ఇలా ఆదివారాల్లో కటింగ్ చేయించుకోవడం మంచిది కాదని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఆదివారాల్లో హెయిర్ కటింగ్( Hair Cutting ), షేవింగ్( Shaving ) చేసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇలా చేయడం కారణంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి హెయిర్ కటింగ్, షేవింగ్ చేసుకోవడానికి మంచి రోజులు ఏవో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. శని, ఆదివారాల్లో హెయిర్ కటింగ్ చేసుకోవద్దట. వీలైనంత వరకు బుధవారం, గురువారం, సోమవారాల్లో హెయిర్ కట్, గడ్డం చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు. ఈ మూడు రోజుల్లో హెయిర్ కటింగ్, షేవింగ్ చేసుకోవడంతో.. అదృష్టం వరించడంతో విశేషమైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చట.
గడ్డం ముందు.. ఆ తర్వాతే కటింగ్..
అలాగే, కటింగ్ చేయించుకునేటప్పుడు ముందుగా గడ్డం గీయించుకోవాలట. ఆపైనే హెయిర్ కట్ చేయించుకోవాలంటున్నారు. ఇలా చేయించుకోవడం ద్వారా కుటుంబ వృద్ధి కలుగుతుందని చెబుతున్నారు. అయితే, ఇక్కడ కుటుంబ వృద్ధి అంటే యవ్వనవంతుడిగా ఉంటాడని అర్థమట.
ఈ తిథుల్లో కటింగ్, షేవింగ్ వద్దు!
ఇకపోతే హెయిర్ కటింగ్, షేవింగ్ అనేది కొన్ని తిథులలో చేయించుకోవడం మంచిది కాదట. పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి వంటి తిథుల సమయంలో కటింగ్, గడ్డం చేయించుకోవడానికి దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు.