Ram Charan | రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో బిర్యానీ పండ‌గ‌.. బేబి బంప్‌తో కనిపించి సంద‌డి చేసిన ఉపాస‌న‌

Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు మరో శుభవార్తతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే రెండేళ్ల క్రితం కూతురు క్లింకారకు జన్మనిచ్చిన ఈ స్టార్ కపుల్, ఇప్పుడు రెండోసారి పేరెంట్స్ కాబోతున్నారు. ప్రస్తుతం ఉపాసన గర్భవతిగా ఉన్నారు. ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా వెల్లడించినప్పటికీ, తాజాగా ఆమె బేబీ బంప్‌తో దర్శనమివ్వడం అభిమానులను మరింత ఆనందానికి గురిచేసింది.

Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు మరో శుభవార్తతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే రెండేళ్ల క్రితం కూతురు క్లింకారకు జన్మనిచ్చిన ఈ స్టార్ కపుల్, ఇప్పుడు రెండోసారి పేరెంట్స్ కాబోతున్నారు. ప్రస్తుతం ఉపాసన గర్భవతిగా ఉన్నారు. ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా వెల్లడించినప్పటికీ, తాజాగా ఆమె బేబీ బంప్‌తో దర్శనమివ్వడం అభిమానులను మరింత ఆనందానికి గురిచేసింది. కొద్ది రోజుల క్రితమే ఉపాసనకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు మెగా కుటుంబంతో పాటు వెంకటేష్ దంపతులు, నయనతార – విఘ్నేష్ శివన్, వరుణ్ తేజ్ దంపతులు వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఆ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సీమంతం తర్వాత బయట ఎక్కువగా కనిపించని ఉపాసన, ఇప్పుడు బేబీ బంప్‌తో దర్శనమివ్వడంతో మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ లభించినట్లయింది. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోల్లో ఉపాసన ఎంతో ప్రశాంతంగా, ఆరోగ్యంగా కనిపించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “మళ్లీ అమ్మ అవ్వబోతున్న ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా, రామ్ చరణ్ ఇంట్లో రీసెంట్‌గా జరిగిన మరో విశేషం కూడా నెట్టింట చర్చకు వచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ బిర్యానీ స్పెషలిస్ట్ చెఫ్ తకమాసా ఒసావా చరణ్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా దేశీ బిర్యానీ వండారు. ఉపాసన, సురేఖతో పాటు కుటుంబ సభ్యులంతా ఆ విందును ఆస్వాదించారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చెఫ్ ఒసావా సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి కూడా వైరల్‌గా మారాయి. ఇక ఉపాసన గర్భధారణపై మరో ఆసక్తికర ప్రచారం నడుస్తోంది. ఆమె ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సీమంతం సమయంలో “డబుల్ హ్యాపీనెస్” అంటూ ఉపాసన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.

సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాలో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉంటూనే, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌లో ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ – ఉపాసన జంట మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంటోంది.

Latest News