Site icon vidhaatha

పవన్ సీక్రెట్ రివీల్ చేసిన అలీ..!

విధాత‌: తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ప్రేక్షకుల్లోనే అనుకుంటే పొరపాటు. ఆయనంటే సీనియర్ కమెడియన్ అలీ, నటుడు నిర్మాత బండ్ల గణేష్, ఇంకా నితిన్ వంటి ఎందరో హీరోలు, న‌టీన‌టులు పడి చస్తారు. అలాంటి ఫాలోయింగ్ పవన్ సొంతం.

ఇక పవన్ కళ్యాణ్‌కు అలీ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే దాదాపు 50 ఇయర్స్ ఇండస్ట్రీ అలీది. త‌న‌కంటే ఎంతో సీనియ‌ర్‌. కిందటి తరం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున‌, వెంక‌టేష్‌ల నుండి చూసుకుంటే ఆయ‌న ప్ర‌స్తుతం మూడో త‌రంతో న‌టిస్తున్నాడు.

దాదాపు అంద‌రి చిత్రాల‌లో అలీ నటించాడు. దాదాపు మనకు తెలిసి తన జీవితంలో అత్యధిక శాతం సినీ నటుడిగా ఉన్న ఘనత అలీకే దక్కుతుంది. ఇప్పుడున్న అందరికంటేను ఆయన సీనియర్. సీతాకోకచిలుక నుంచి నేటి వరకు ఎన్నెన్నో చిత్రాల్లో న‌టించారు. దాదాపు 1500 వరకు సినిమాలు ఆయన ఖాతాలో ఉండుంటాయి.

వీటిలో హీరోగా కూడా చేశాడు. హీరోగా కూడాను ఆయనకు మంచి హిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ‘యమలీల, పిట్టలదొర’ వంటి చిత్రాలు అలీకి హీరోగానూ పేరు తెచ్చాయి. పవన్ కళ్యాణ్‌కు మొదటి నుంచి అలీ అంటే అభిమానం. అలీ తన పక్కనుంటే తాను షూటింగ్ స్పాట్‌లో చాలా ధైర్యంగా ఉంటానని అతను బాగా ప్రోత్సహిస్తాడని…. అలీ ఉంటే తాను రచ్చ రచ్చ చేస్తానని ఒకసారి పవన్ చెప్పాడు.

అంతేకాదు కొన్నిసార్లు పవన్‌కి షూటింగ్ ఉండి అలీకి లేకపోయినా అలీని పిలిచి మరి షూటింగ్ స్పాట్లో కూర్చోబెట్టుకుంటానని చెప్పాడు. అలాంటి అలీ- పవన్‌ల మధ్య ఈమధ్య పలు విభేదాలు వచ్చాయని మీడియా కథనాలు వచ్చాయి.

ఒకప్పుడు మురళీమోహన్ అండతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న అలీ.. ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీలో చేరాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏమో జనసేన పార్టీ స్థాపించాడు. కానీ ఆ పార్టీలో చేరకుండా అలీ వైసీపీలో చేరడంతో ఈ పుకార్లకు బలం చేకూరింది.

వాస్తవానికి పవన్ కెరీర్ బిగినింగ్ నుండి వీరి ప్రయాణం సాగుతోంది. ఒకటి రెండు సినిమాలు మిన‌హా పవన్ హీరోగా తెరకెక్కిన ప్రతి చిత్రంలో అలీకి ప్రత్యేక పాత్ర ఉంటుంది. చెప్పే అవసరం లేకుండా ప్రతి దర్శకుడు పవన్ సినిమా చేసేటప్పుడు అలీకి ఒక మంచి పాత్ర‌ను రాసుకుంటాడు.

అయితే 2018లో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ మూవీలో అలీ నటించలేదు. దానికి కారణం డేట్స్ కుదరకపోవడమే అని గతంలో అలీ చెప్పాడు. దాదాపు అదే సమయంలో జనసేన పార్టీ తరఫున పవన్ తన పోరాటం సాగిస్తున్నాడు. ఇక వైసీపీలో చేరిన అలీకి ప్ర‌మోష‌న్‌గా ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ప‌ద‌విని ఇచ్చింది.

ఇక ‘అజ్ఞాతవాసి’లోనే కాదు పవన్ గత రెండు చిత్రాలైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌లలో కూడా అలీ నటించలేదు. ఇటీవల అలీ తన కూతురు వివాహం ఘనంగా చేశాడు. ఆ పెళ్లి వేడుకకు చిత్ర ప్ర‌ముఖులంద‌రూ హాజరయ్యారు.

ఎందుకంటే ఆయన దాదాపు అందరితో క‌లిసి న‌టించారు. కానీ ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్లలేదు. ఈ పరిణామాల‌ నేపథ్యంలో రాజకీయ కారణాలతో పవన్- అలీ విడిపోయారని మరింత బలమైన ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి ఆలీ తాజాగా స్పష్టత ఇచ్చాడు.

ఆయన అలీతో సరదాగా షోలో గెస్ట్‌గా రాగా.. సుమ ప్రశ్నకు సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్‌తో నాకు ఎలాంటి గ్యాప్ రాలేదు. గ్యాప్ కొందరు క్రియేట్ చేశారు. అది ఎవరో కాదు కేవలం మీడియానే. మీడియా నిరాధార కథనాలు ప్రచారం చేసింది. అవి జనాలు నమ్ముతున్నారు.

నా కూతురు వివాహానికి ఆహ్వానించేందుకు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ సెట్స్‌కు వెళ్లాను. అదే సమయంలో ఆయనను వేరే వాళ్లు కూడా ఆయనను కలిసేందుకు వచ్చారు. వాళ్లను వెయిట్ చేయమని చెప్పి పవన్ నన్ను కలిశారు. దాదాపు 15 నిమిషాలు మేము సరదాగా మాట్లాడుకున్నాం. అనేక విషయాలు చర్చించుకున్నాం.

మా అమ్మాయి పెళ్ళికి ఆయన రావాల్సి ఉంది. చివరి నిమిషంలో విమానం క్యాన్సిల్ కావడంతో ఆయన రాలేకపోయారు. మా అమ్మాయి పెళ్ళికి పవన్ రాకపోవడానికి కారణం అదే. అంతకుమించి ఎలాంటి విభేదాలు లేవు…

పరిశ్రమలో పవన్, నేను ఎప్పటికీ మిత్రులమే అని అలీ చెప్పుకొచ్చాడు. దాంతో అలీ, పవన్‌ల మధ్య గ్యాప్ కేవలం మీడియా సృష్టే అని అలీ సమాధానంతో స్పష్టమవుతుంది.

Exit mobile version