Green Chilli | పచ్చిమిర్చి కారానికి భయపడి చాలా మంది తినడం మానేస్తుంటారు. పచ్చిమిరపకాయలతో మంచిలాభాలుంటాయి. దీనికి బదులుగా ఎర్రకారాన్ని కూరల్లో వాడుతుంటారు. వీటి గురించి తెలుసుకుంటే మాత్రం ఇకపై పచ్చిమిర్చిని ఇష్టంగా తింటారు. వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో మిరపకాయ చాలా ముఖ్యమైంది. కానీ, దాని పనితీరు కేవలం మసాలాగా మాత్రమే పరిమితం కాదు. మిరపకాయలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మిరపకాయల్లో ఉండే ఈ పోషకాలు అనేక వ్యాధులకు మేలు చేస్తాయి.
పచ్చి మిర్చీతో లాభాలు
- మిరపకాయ తినేటప్పుడు చాలా సార్లు మన ముక్కు నుంచి కారుతూ ఉంటుంది. కానీ, ఈ కారం జలుబు, ఫ్లూ నయం చేయడానికి ఉపయోగపడుతుంది. పచ్చిమిర్చి తింటే దగ్గు, జలుబు సమస్య నుంచి బయటపడొచ్చు.
- మీరు అజీర్ణం సమస్యలతో బాధపడుతున్నట్లయితే పచ్చి మిర్చిలను తింటే ప్రయోజనం ఉంటుంది. పచ్చి మిరపకాయ కడుపుని మృదువుగా చేస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.
- పచ్చిమిర్చి బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. మిర్చీ జీవక్రియను పెంచడంతోపాటు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. పచ్చి మిరపకాయలను రోజూ తింటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
- పచ్చిమిర్చి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. పచ్చిమిర్చి తినడం ద్వరా అంటువ్యాధులు దూరమవుతాయి.
- పచ్చి మిర్చిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మన శరీరాన్ని బ్యాక్టీరియా నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- పచ్చి మిరపకాయల్లో ఉండే పోషకాలు సిరల వాపును తొలగిస్తాయి. పచ్చి మిరపకాయలు బర్నింగ్ సెన్సేషన్, సిరల్లో వాపు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
- పచ్చిమిర్చి ఎక్కువగా తింటే ముఖం ఎర్రగా మారుతుంది. కానీ, పచ్చిమిర్చి కూడా ముఖానికి మేలు చేస్తుంది. పచ్చి మిరపకాయల్లో యాంటీ రింక్ల్ గుణాలు ఉన్నాయి. ఇవి ముఖం ముడుతలను తొలగించడానికి పని చేస్తాయి.