Site icon vidhaatha

Coffee | కాఫీ తాగండి.. మెద‌డు బాగా ప‌నిచేస్తుంది

Coffee Versus Caffeine

శాన్‌ఫ్రాన్సిస్కో: ఒక కప్పు కాఫీ తీసుకోవడం వల్ల మ‌న‌కు వ‌చ్చే శ‌క్తి సాధార‌ణ కెఫీన్ వ‌ల్ల సాధ్యం కాద‌ని తాజా అధ్యయనం ఒక‌టి వెల్లడించింది. ఫ్రాంటియర్స్ జర్నల్‌లో (Frontiers in Behavioral Neuroscience) ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కలిగే మంచి ప్రభావాలు, సాదా కెఫీన్ వ‌ల్ల కొంచెమే క‌లుగుతాయ‌ని ‘ది ఇండిపెండెంట్’ తెలిపింది.

మెదడులో చైత‌న్యాన్ని పెంచడమే కాకుండా, కాఫీ మెదడులో ఉండే జ్ఞాప‌క‌శ‌క్తిని, నిర్దేశిత ల‌క్ష్యచేధ‌న (goal-directed behaviour ) ప్ర‌వ‌ర్త‌న‌ను కూడా ప్రభావితం చేస్తుంది. “కాఫీ చురుకుదనం మరియు శ‌రీర క‌ద‌లిక‌ల‌ పనితీరును పెంచుతుందని మ‌నకు ఓ అభిప్రాయం ఉంది. కానీ ఇది అంత‌కు మించిన విష‌యం. మెద‌డు యంత్రాంగం, అది ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం న‌డ‌వ‌డం వెనుక చాలా త‌తంగం ఉంటుంది.

దాన్ని ఓ క‌ప్పు కాఫీ ప్రేరేపిస్తుందంటే ఆశ్చ‌ర్యంగా ఉంటుందని అధ్యయన సహ రచయిత నునో సౌసా (Nuno Sousa )వివరించారు. ప‌రిశీల‌న‌కు ముందు, రోజుకు కనీసం ఒక కప్పు కాఫీ తాగేవారిని మూడు గంటల పాటు కెఫిన్ సంబంధిత ప‌దార్థాల‌ను తినడం లేదా త్రాగడం మానుకోవాలని కోరారు. వారికి రెండు చిన్న బ్రెయిన్ MRIల‌ను తీశారు. ఒకటి కాఫీ లేదా కెఫిన్ సంబంధిత ప‌దార్థాల‌ను తీసుకోవ‌డానికి ముందు, ఇంకొక‌టి త‌ర్వాత‌ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కాఫీ మరియు కెఫిన్ రెండింటినీ తాగడం వల్ల మెదడు నెట్‌వర్క్‌లో న్యూరానల్ సంబంధం తగ్గుతుంది.

ఈ మార్పు ప్రజలు విశ్రాంతి నుంచి పనులవైపు మ‌ర‌ల‌డానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుందని పరిశోధకులు తెలిపారు. కాఫీ తాగడం వల్ల దృష్టిని నియంత్రించే మెదడు నరాల వ్య‌వ‌స్థ‌లో సంబంధాల‌ను మెరుగవ‌డంతో పాటు జ్ఞాప‌క‌శక్తి, ఇత‌ర అవ‌గాహ‌నాశ‌క్తులు (working memory, cognitive control, and goal-directed behaviour.) కూడా ప్ర‌భావితమ‌వుతాయి.

అయినప్పటికీ, కెఫిన్ మాత్రమే తీసుకున్నప్పుడు ఇటువంటి ప్రభావాలు క‌న‌బ‌డ‌లేదని వారి ప‌రిశోధ‌న నిరూపించింది. కాఫీ తాగినప్పుడు వారంతా చాలా చురుకుగా, ప‌నులు చేయ‌డానికి దూకుడుగా ఉన్నార‌ని అధ్యయనం సహ రచయిత మరియా పికో-పెరెజ్ చెప్పారు. అదనంగా, కెఫిన్ కలిగిన పానీయాలు కాఫీతో కొద్దిమేర‌కు ప్రభావాలను పంచుకున్నప్పటికీ, కాఫీ తాలూకు సువాసన, రుచి, అలాగే కాఫీ తాగేట‌ప్పుడు మ‌న‌సు అనుభ‌వించే అహ్లాదం విష‌యంలో ఏమాత్రం ద‌గ్గ‌రికి రాలేదని శాస్త్రజ్ఞులు తెలిపారు.

Exit mobile version