Site icon vidhaatha

ఇంటింటికీ వెళ్లి కుష్ఠు వ్యాధి ప‌రీక్ష‌లు

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగంగా కుష్ఠు వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి చికిత్స అందించే కార్యక్రమం ప్రారంభమయింది. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో566మంది ఆశ కార్యకర్తలతో కూడిన సెర్చ్ టీమ్ ఇంటింటికీ వెళ్లీ ప్రతి వ్యక్తినీ పరీక్షించి వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించడం జరుగుతోంది.

తెల్లటి గోధుమ లేదా రాగి రంగు కలిగిన మచ్చలు లేదా కాళ్లు చేతులకు తిమ్మిర్లు, నడుస్తున్నప్పుడు చెప్పులు జారడం, తెలియ కుండా గాయాలు కావడం, చేతి వేళ్ళు కాలి వేళ్ళు వంకర కావడం లాంటి లక్షణాలు కలిగిన ప్రతి వ్యక్తిని సెర్చ్ టీమ్ పరీక్ష చేస్తుంది.

జిల్లాలో మొదటి రోజు 14992 ఇళ్ల‌ను సందర్శించి 59835 మందిని పరీక్షించగా జిల్లా వ్యాప్తంగా 53 మంది వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించారు. కుష్టు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉంది. కావున వ్యాధి లక్షణాలు కలిగిన వారు తప్పకుండా ఇంటికి సందర్శించే సెర్చ్ టీమ్ కి చూపించుకో వలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీ బీ. చందు నాయక్ కోరారు.

Exit mobile version