food digestion | కడుపులో ఆహారం జీర్ణమయ్యే విధానం గురించి మీరు తరుచూ ఆలోచిస్తుంటారా..? తద్వారా ఏవి తింటే జీర్ణమవుతాయి.. సమస్యలు ఎదురవుతున్నాయో మీకు తెలిసిపోతుంది. అయితే, ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది..? ఎలా జీర్ణం అవుతుందో మీకు తెలుసా..? చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదు. ఇవాళ మన కడుపులో మన కడుపులోని ఆహారం వివిధ దశల్లో ఎలా జీర్ణమవుతుందో తెలుసుకుందాం రండి..!
ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ..
తినడం అనేది నోటికే పరిమితం కాదు. ఆహారం నోటిలోకి ప్రవేశించిన తరువాత.. అది జీర్ణం కావడానికి అనేక దశలను దాటాల్సి ఉంటుంది. మొదటి దశలో నోటిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ ఇక్కడే మొదలవుతుంది. ఆహారం నోటిలోకి పెట్టుకున్న తర్వాత నమలడం జరుగుతుంది. ఈ సమయంలో లాలాజలం, కొన్ని జీర్ణ ఎంజైమ్‌లు మిళితమవుతాయి. ఇవి ఆహారాన్ని మృదువుగా మారుస్తాయి. తద్వారా సులువుగా మింగేందుకు సహాయపడుతాయి. మింగిన తర్వాత ఆహారం అన్నవాహికలోకి వెళ్తుంది.
ఆ తర్వాత..
అన్నవాహిక తర్వాత ఆహారం ‘ఎసోఫాగియల్ స్పింక్టర్’లోకి చేరుతుంది. ఇక్కడ జీర్ణ రసాలను కలుస్తాయి. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. మూడో దశలో ఆహారం చిన్న ప్రేగులకు వెళుతుంది. ఆహారం జీర్ణక్రియ చిన్న ప్రేగుల్లో జరుగుతుంది. ఇది ఆహారం నుంచి కొన్ని పోషకాలను గ్రహిస్తుంది. అక్కడి నుంచి మిగితా ఆహారం పెద్ద ప్రేగులకు వెళ్తాయి. ప్రేగు కదలికల ద్వారా పెద్ద ప్రేగు నుంచి ఆహార వ్యర్థాలను తొలగిస్తుంది.
జీర్ణానికి చాలా సమయమే పడుతుంది..
నోటిలో ఆహారం పెట్టినప్పటి నుంచి మలం ఏర్పడే వరకు జీర్ణక్రియ ప్రక్రియ పూర్తవుతుంది. జీర్ణమయ్యే సమయం తీసుకునే ఆహారం, జీర్ణశక్తిపై ఆధారపడి ఉంటుంది. జీర్ణక్రియ ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి 2-5 రోజులు పడుతుంది. ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే.. అది సులువుగా జీర్ణమవుతుంది. తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే జీర్ణమయ్యేందుకు తక్కువ సమయం పడుతుంది.