Site icon vidhaatha

Black Rice | బ్లాక్‌ రైస్‌తో క్యాన్సర్‌, గుండెపోటు సహా నాలుగు వ్యాధులు చెక్‌..!

Black Rice | బ్లాక్‌ రైస్‌.. వీటి గురించి ఎక్కువ విన్న వారే తప్ప తినే వారు కాస్త తక్కువగానే ఉంటారు. వాటి ధర కాస్త ఎక్కువగా ఉండడంతో చాలా మంది వీటివైపు కన్నెత్తి చూడరు. రేటు ఎక్కువగా ఉన్న వీటితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోతారు. ఈ బ్లాక్ రైస్ సులభంగా జీర్ణమవుతాయి. అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనితో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్లాక్‌ రైస్‌తో కలిగితే నాలుగు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుంటే ఓ సారి తెలుసుకుందాం..

కండ్లకు మంచివి..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం. బ్లాక్ రై‌స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు జియాక్సంతిన్, లుటిన్ ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లతో కళ్ల కాంతి పెరిగి వాటికి హాని కలిగించే వాటి నుంచి రక్షణ కల్పిస్తాయి.

మెండుగా పోషకాలు..

బ్లాక్ రైస్‌లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరం దృఢంగా మారి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది

బ్లాక్ రైస్ తినడం గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్ అనే మూలకం ఉంటుంది. ఇది గుండె జబ్బులను నయం చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో ఆంథోసైనిన్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ నుంచి రక్షణ

ఈ నల్లని బియ్యం తినడం వల్ల క్యాన్సర్ నుంచి చాలా వరకు రక్షణ లభిస్తుంది. ఈ బియ్యంలో ఆంథోసైనిన్ ఉంటుంది. దీని కారణంగా వాటి రంగు నలుపు-ఊదా రంగులోకి మారుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఈ బియ్యంలో ఉన్నాయి.

Exit mobile version