- సత్ఫలితాలిచ్చిన ఎలుకలపై ప్రయోగం
- తదుపరి మనిషి గుండె పైనే..
ఈ మధ్య కాలంలో తరచుగా గుండెపోటుతో చనిపోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న వయస్సులోనూ హార్ట్ ఎటాక్‌తో మరణించే వారి సంఖ్య రోజు రోజుకి అధికమవుతుంది. దీంతో ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పుడు ఆ భయం అక్కర్లేదంటున్నారు సైంటిస్టులు. గుండెపోటుతో మరణించినా బతికేయచ్చని తియ్యటి వార్త చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్ సర్జరి, లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. అయితే ఏ వ్యక్తికైనా సరే హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు వీలైనంత త్వరగా హాస్పటల్‌కు తీసుకెళ్లి, చికిత్స చేయించాలి. దీంతో ప్రాణాపాయం బయటపడే అవకాశం ఉంటుంది.
అయితే కొన్ని సందర్భాల్లో హాస్పిటల్‌కు తరలించడం ఆలస్యం అవుతుంది. పలు కారణాల వల్ల కూడా ఆలస్యం జరగొచ్చు. దీంతో సమయానికి చికిత్స అందించకపోవడంతో రోగి హార్ట్ ఎటాక్‌తో చనిపోతాడు. ఆయుష్సు ఇంతే అని బాధ పడడం తప్ప ఏమీ చేయలేపోయేవాళ్లం. అయితే ఇకపై ఆ బాధ ఉండదంని హార్ట్ ఎటాక్‌తో ఎవరైనా చనిపోతే వారిని తిరిగి బతికించేందుకు వీలుందంటున్నారు కేంబ్రిడ్జి పరిశోధకులు.
వినడానికి ఆశ్చర్యమేసినా ఇది నిజమే. కేంబ్రిడ్జి పరిశోధకులు గుండె జబ్బులను నివారించడంలో తాజాగా అద్భతమైన విజయం సాధించారు. హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయిన గుండె రక్తనాళాలు, గుండె కణజాలానికి వారు తిరిగి ప్రాణం పోశారు. గుండెపోటు వచ్చినప్పుడు సహజంగానే గుండె కణజాలానికి ఆక్సిజన్ అందదు. దీంతో గుండెలోని కొన్ని ప్రాంతాలు దెబ్బతిని.. అక్కడి కణజాలం నాశనమవుతుంది. తిరిగి అది పునర్నిర్మాణం చెందలేదు. దీంతో వ్యక్తి చనిపోతాడు.
అయితే ఆ నాశనమయ్యే కణజాలానికి సైంటిస్టులు జీవం పోశారు. కేంబ్రిడ్జి పరిశోధకులు మానవ గుండెలో నుంచి రెండు రకాల స్టెమ్ సెల్స్‌ను తీసుకొని వాటిని ఎలుకలలోని చనిపోయిన గుండె కణజాలంలోకి ఎక్కించారు. అనంతరం వాటిని ల్యాబ్‌లో పెంచారు. ఈ క్రమంలో పెరిగిన కణజాలాన్ని తీసుకెళ్లి తిరిగి ఎలుక గుండెల్లోకి ఎక్కించారు. అయితే ఆశ్చర్యంగా అప్పటికే చనిపోయిన ఎలుకల గుండెలోని కణజాలం తిరిగి జీవం పోసుకుంది.
ఎలుకల ప్రయోగం సక్సెస్ కావడంతో ఈ ప్రయోగాన్ని మనుషుల గుండెలపై చేయడమే తరువాయి అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ప్రయోగం మనుషులపై సక్సెస్ అయితే గుండె జబ్బుల బాధితులకు వరమనే చెప్పాలి. ఎందుకంటే గుండెపోటు వల్ల చనిపోయిన గుండె కణజాలాన్ని తిరిగి బతికిస్తారు. దీంతో గుండె తిరిగి పనిచేస్తుంది. అంటే చనిపోయిన వారిని బతికించినట్టే అవుతుంది కదా. మరి సైంటిస్టులు ఈ విషయంలో ముందడుగు వేస్తారా లేదా.. అది ఎప్పుడు వేస్తారనేది వేచి చూడాలి.