Site icon vidhaatha

‘కంటి వెలుగు’కు రూ.200 కోట్లు.. మంత్రి హరీశ్‌రావు ఉన్న‌త‌ స్థాయి సమీక్ష

విధాత‌: కంటి వెలుగు పథకంపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగ‌ళ‌వారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటి సమస్యలకు చికిత్స అందించేందుకు కంటివెలుగు కార్యక్రమం మ‌ళ్లీ చేపడుతున్నా మన్నారు.

ఈసారి కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని, 55 లక్షల మందికి కళ్లద్దాలు ఇవ్వాలని నిర్ణయించి నట్టు తెలిపారు. కంటి వెలుగు రెండో దశ కోసం రూ.200 కోట్లు మంజూరు చేశామన్నారు. కంటి సమస్యలతో ఎవరూ బాధ పడకూడదు అనేది సీఎం లక్ష్యం అని తెలిపారు. కంటివెలుగులో బాగా పనిచేసేవారికి ప్రశంసలు ఉంటాయని చెప్పారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో నమోదయ్యేలా కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.

Exit mobile version