Site icon vidhaatha

కేరళలోనే సగానికి పైగా కరోనా కేసులు

– మరో 133 మందికి సోకిన వైరస్

– తాజాగా దేశవ్యాప్తంగా 263 కొత్త కేసులు నమోదు

న్యూఢిల్లీ: కొవిడ్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌ 1 కేసులు కేరళలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డిసెంబర్‌ లో తొలిసారి ఈ వేరియంట్‌ కేసుల్ని గుర్తించగా, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదుకావడంతో ఆ రాష్ట్ర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్‌ సబ్‌ వేరియంట్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో 263 కేసులు నమోదయ్యాయి. వాటిలో సగానికిపైగా కేరళలోనే ఉన్నట్లు వైద్యాధికారులు వివరించారు. ఇప్పటికే ఈ సబ్ వేరియంట్ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలకు విస్తరించింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ సబ్‌ వేరియంట్‌ ఉనికిని గుర్తించారు. తాజా కేసుల్లో కేరళలో 133, గోవాలో 51, గుజరాత్‌ లో34, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 9, రాజస్థాన్‌ లో 5, తమిళనాడులో (4), తెలంగాణలో 2, ఒడిశాలో ఒకటి చొప్పున యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో 4,565 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Exit mobile version