Site icon vidhaatha

Nalgonda: సాగర్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం .. వీల్ చైర్ సేవలపై నిరాకరణ

విధాత: నల్గొండ(Nalgonda) జిల్లా నాగార్జున సాగర్(Sagar Hospital) ప్రభుత్వ కమలా నెహ్రూ(Govt Kamala Nehru) ఆసుపత్రి(Hospital)లో రోగులపట్ల సిబ్బంది నిర్లక్ష్య ధోరణి మరోసారి వివాదాస్పదమైంది. వైద్యం కోసం వచ్చిన పేషెంట్ వీల్ చైర్(wheel chair) అడగగా సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. వీల్ చైర్ ఇవ్వడం, పేషెంట్(Patient)ని కూర్చోబెట్టుకొని నెట్టుకుంటూ పోవడం మా పని కాదని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని పేషెంట్ కు వార్నింగ్ ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో
పేషెంట్ బంధువులే పేషెంట్ ని వీల్ చైర్ లో ఆసుపత్రిలోకి తీసుకుని వెళ్లారు.

హాస్పిటల్ స్టాఫ్ చాలా సంవత్సరాలుగా ఇక్కడే పనిచేయడంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. సిబ్బంది పనితీరును ఎవరైనా రోగులు ప్రశ్నిస్తే వారిపైన, వారి సహాయకులుగా వచ్చిన బంధువుల పైన దురుసుగా ప్రవర్తించడం సాధారణమైపోయింది. మారుమూల ప్రాంతం కావడంతో అంత దూరం వెళ్లి ఉన్నతాధికారులు తరచూ తనిఖీలు చేయకపోవడం కూడా సిబ్బందికి అలుసుగా మారింది.

24గంటలు అందుబాటులో ఉండాల్సిన డాక్టర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదన్న అసంతృప్తి ఆసుపత్రి పరిధిలోని గ్రామాల ప్రజల్లో వినిపిస్తోంది. తక్షణమే గ్రామీణ ప్రాంత ప్రజలకు కీలకంగా ఉన్న సాగర్ కమలా నెహ్రు ఆసుపత్రి వైద్య సేవల సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి పనిచేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Exit mobile version