Health Tips : మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మధుమేహం బారినపడుతున్నారు. రోజురోజు డయాబెటిస్ వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధుమేహ బాధితులు, మందులు, ఇన్సులిన్ తీసుకోవడం తప్పనిసరి. ఆహారంలో చిన్న చిన్న మార్పులను చేసుకుంటే వస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలను వినియోగించి రక్తంలో షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. మన ఇంట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు ఆహారంలో భాగంగా చేసుకుని రోజూ తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది. అవేంటో ఓ సారి తెలుసుకుందా రండి..
మెంతులు
డయాబెటిస్ బాధితులకు మెంతులు చాలా మేలు చేస్తాయి. మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉంటాయి. మెంతులు తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. మెంతి గింజలను నానబెట్టి తీసుకోవడం తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి. పొడి తయారు చేసిన తర్వాత కూడా ఖాళీ కడుపుతో తినడం మధుమేహం నుంచి ఊరట కలుగుతుంది.
నల్ల మిరియాలు
నల్ల మిరియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మిరియాలను పొడిని పసుపుతో కలిపి ఉంచుకోవాలి. భోజనానికి ఒక గంట ముందు ఈ పొడిని తీసుకోవాలి. తద్వారా షుగర్ అదుపులో ఉంటుంది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్కతో డికాక్షన్ తయారు చేసుకొని తాగితే షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. పసుపు, మెంతి గింజలతో దాల్చిన చెక్కను కలిపి పొడిని తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని గోరువెచ్చని నీటితో ఖాళీ కడుపుతో తీసుకోవాలి. డయాబెటిస్‌పై ప్రభావవంతంగా పని చేస్తుంది.
ఆహారం విషయంలో శ్రద్ధ చూపాలి
మధుమేహాన్ని నియంత్రించడానికి ఆహారంపై శ్రద్ధ చూపడం కీలకం. ఎందుకంటే తీసుకున్న ఆహారం వెంటనే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మీరు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే, మీరు అధిక కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్, ప్రోటీన్, యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న వాటిని తీసుకుంటే ఫలితముంటుంది.