Site icon vidhaatha

అధిక కొలెస్ట్రాల్‌తో బాధ పడుతున్నారా..? వీటి జ్యూస్‌ తాగి చూడండి..!

Vegetable Juice | ఆకుకూరలు, కూరగాయలలో ఆరోగ్యానికి అవసరమైన అద్భుతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కూరగాయలు అన్నీ ఆరోగ్యానికి మేలుచేసే అయినప్పటికీ.. కొన్ని కూరగాయలలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ పెరిగే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువవుతుంది. కొవ్వు ధమనుల్లో రక్త సరఫరాకు ఆటంకం కలిగించడంతో అధిక రక్తపోటు, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే, కొన్ని ఆకుకూరలు, కూరగాయల రసాన్ని తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత తీవ్రమైన వ్యాధులను దూరం చూసుకోవచ్చు. అవేంటో ఓ సారి తెలుసుకోందాం రండి..!

పాలకూర

ఆకుపచ్చని కూరలు గుండెకు మేలు చేస్తాయి. పాలకూరలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పాలకూర ఉపయోగపడుతుంది. పాలకూరతో స్మూతీ, సూప్ లేదంటే జ్యూస్ తయారు చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

బీట్‌రూట్

బీట్‌రూట్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. బీట్‌రూట్‌లో ఫైటోస్టెరాల్స్ ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడి, శరీరం నుంచి బయటకు పంపుతాయి. బీట్‌రూట్ రసం తీసుకోవడం వల్లం కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీట్‌రూట్ శరీరాన్ని డిటాక్సిఫై చేసి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

టొమాటో..

టొమాటో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పని చేస్తుంది. టొమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి పని చేస్తాయి. టమోటా రసం, సూప్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

సోరకాయ..

సోరకాయ కొలెస్ట్రాల్‌తో బాధపడే వారికి చాలా మేలు చేస్తుంది. సోరకాయ రసం తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. విటమిన్ సీ, విటమిన్ కే ఇందులో ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. సోరకాయ రసాన్ని ఆహారంలో చేర్చుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.

బీన్స్

బీన్స్ జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. చిక్కుళ్లలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పని చేస్తాయి.

Exit mobile version