Site icon vidhaatha

peas | పోషకాల గని బఠాని..! వీటితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..!

peas | పోహా పనీర్‌ వరకు చాలా వంటకాల రుచిని పెంచేందుకు బఠానిలను వినియోగిస్తుంటారు. బఠానీలు తినేందుకు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బఠానీల్లో అనేక పోషకాలుంటాయి. ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తాయి. ఈ పచ్చిబఠానీలు తీసుకుంటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో ఓ సారి తెలుసుకుందాం..

ఎముకలను బలపరుస్తాయి

బఠానీలు ఎముకలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఉంటాయి. బఠానీలు ఎముకలు, కండరాలను దృఢంగా మారుస్తాయి. శ‌రీరాన్ని దృఢ‌ప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డే విటమిన్లు బఠానీల్లో పుష్కలంగా ఉంటాయి.

జీర్ణక్రియకు ప్రయోజనకరం

బఠానీల్లో ఫైబర్, విటమిన్లు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

బఠానీల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తరుచూ తీసుకుంటూ వస్తే మెదడు పనితీరు పెంచుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతాయి.

క్యాన్సర్‌కు చెక్‌..

బఠానీల్లో యాంటీ ఆక్సిడెంట్లు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బఠానీలు తినడం వల్ల కణాలు, కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి. బఠానీలు తినడంతో కణజాలం అసాధారణంగా పెరగదు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

బఠానీల్లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు పని చేస్తాయి. వీటిని తింటే అంటువ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారు. బఠానీలలో మెగ్నీషియం మంచి మోతాదులో ఉంటుంది. ఇది వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతుంది.

చర్మానికి ప్రయోజనకరమైనది

బఠానీలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు చర్మం కూడా మెరుగ్గా తయారవుతుంది.

Exit mobile version