Jubilee Hills By-Election Notification 2025 | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్.

Jubilee Hills by Election Notification 2025

హైదరాబాద్, అక్టోబర్ 13(విధాత): జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలయింది. ఈమేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గెజిట్‌ జారీ చేసింది. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలోనీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేటి నుంచి నామినేషన్ ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయింది. ఈ నెల 21వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 22న నామినేషన్ల పరిశీలన, 24 వ తేదీ ఉప సంహరణ చేసుకునేందుకు గడువు ఇచ్చారు. వచ్చే నెల 11న పోలింగ్‌ నిర్వహించి, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు‌. సెలవు రోజులు మినహా మిగిలిన పనిదినాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు డిజిటల్ విధానంలో కూడా దాఖలు చేసే అవకాశం కల్పించారు.