Site icon vidhaatha

ఫిబ్రవరిలో కేసులు భారీగా పెర‌గొచ్చు: డీహెచ్ శ్రీనివాసరావు

విధాత‌: ఒకట్రెండు నెలల్లో భారత్ లో, వచ్చే ఏడాది జనవరి 15 తర్వాత తెలంగాణలోనూ కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ కేసులు పెరుగు తున్నాయని చెప్పారు. వాటిలో 75శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయన్నారు. కానీ అక్కడ కేసులు పెరిగినా ఆస్పత్రుల లో చేరికలు, మరణాలు పెరగడం లేదని తెలిపారు.

విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ విమానాశ్రయంలో పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 900 మందికి పైగా విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్నారని… వారిలో 13మందికి కొవిడ్ నిర్ధార‌ణ‌ అయిందన్నారు. వారిని క్వారంటైన్ లో ఉంచామని.. వారికి ఒమిక్రాన్ సోకిందా లేదా అనే విషయం ఒకట్రెండు రోజుల్లో తేలుతుందని చెప్పారు. ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడం లేదని అన్నారు.

వైరస్‌ సోకితే తీవ్ర ఒళ్లునొప్పులు, తలనొప్పి, నీరసం ఉంటాయన్నారు. కొవిడ్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దాస్తు న్నామన్న వార్తలో వాస్తవం లేదని తెలిపారు. తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం దెబ్బతింటుందని.. కొవిడ్‌ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమని అన్నారు. ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేశామని చెప్పారు. ఇప్పటివరకు 92 శాతం మందికి మొదటి డోసు పూర్తి కాగా.. 48 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయన్నారు. ఈ నెలాఖరు లోపు 100 శాతం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు.

ఇక ఒకట్రెండు నెలల్లో భారత్‌లోనూ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 15 తర్వాత రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక ఫిబ్రవరిలో భారీగా కేసులు నమోదు కావొ చ్చన్నారు. కావున ప్రజలంతా తప్పకుండా నిబంధనలు పాటించాలన్నారు. పండుగల విషయంలో జాగ్రత్తగా ఉండాల న్నారు అయితే రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌లు ఉండవని స్పష్టం చేశారు

చల్మెడ వైద్య కళాశాలలో కరోనా పంజా: 43 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్

కరీంనగర్ జిల్లాలోని చెలమడ వైద్య కళాశాలలో 43 మంది వైద్య విద్యార్థులకు కరోన సోకింది. విద్యార్థులకు లక్షణాలు ఉండడంతో యాజమాన్యం పరీక్షలు నిర్వహించ‌గా 43 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. కాగా యాజమాన్యం వెంట‌నే స్పందించి కళాశాలకు సెలవు ప్రకటించింది. వెయ్యి మంది విద్యార్థులు ఉన్న ఈ కళాశాలలో వైద్య విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version