Cyprus | వైర‌స్ సోకి 3 ల‌క్ష‌ల పిల్లుల మృతి… శ‌వాల దిబ్బ‌గా మారుతున్న‌ దేశం

Cyprus విధాత‌: పిల్లుల ద్వీపంగా పేరొందిన సిప్ర‌స్ దేశం క‌రోనా కుటుంబానికి చెందిన వైర‌స్ కార‌ణంగా క‌కావిక‌ల‌మ‌వుతోంది. గ‌త కొద్ది నెల‌లుగా ఫెలైన్ స్ట్రెయిన్‌గా పిలుచుకునే ఈ వైర‌స్ వేల కొల‌దీ పిల్లుల ప్రాణాలు తీసింది. ఇక్క‌డి పిల్లులు ఎక్కువ‌గా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జీవిస్తూ ఉంటాయి, స్థానికుల‌తోనూ, ప‌ర్యాట‌కుల‌తోనూ ఇవి ఎంతో స్నేహ‌పూర్వ‌కంగా ఉంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. ప్ర‌స్తుతం వీటిల్లో వ్యాపిస్తున్న వైర‌స్‌ను ఫెలైన్ ఇన్‌ఫెక్షియ‌స్ డిజీస్ (ఎఫ్ ఐ పీ) అని పిలుస్తున్నారు. ఇక్క‌డి […]

  • Publish Date - July 12, 2023 / 04:58 AM IST

Cyprus

విధాత‌: పిల్లుల ద్వీపంగా పేరొందిన సిప్ర‌స్ దేశం క‌రోనా కుటుంబానికి చెందిన వైర‌స్ కార‌ణంగా క‌కావిక‌ల‌మ‌వుతోంది. గ‌త కొద్ది నెల‌లుగా ఫెలైన్ స్ట్రెయిన్‌గా పిలుచుకునే ఈ వైర‌స్ వేల కొల‌దీ పిల్లుల ప్రాణాలు తీసింది. ఇక్క‌డి పిల్లులు ఎక్కువ‌గా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జీవిస్తూ ఉంటాయి, స్థానికుల‌తోనూ, ప‌ర్యాట‌కుల‌తోనూ ఇవి ఎంతో స్నేహ‌పూర్వ‌కంగా ఉంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి.

ప్ర‌స్తుతం వీటిల్లో వ్యాపిస్తున్న వైర‌స్‌ను ఫెలైన్ ఇన్‌ఫెక్షియ‌స్ డిజీస్ (ఎఫ్ ఐ పీ) అని పిలుస్తున్నారు. ఇక్క‌డి స్థానికులు, వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల క‌థ‌నాల ప్ర‌కారం… ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన పిల్లుల సంఖ్య 3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండొచ్చ‌ని తెలుస్తోంది.

మ‌నుషుల‌కు సోకుతుందా?

ఎఫ్ ఐ పీ వ‌చ్చిన పిల్లుల్లో తెల్ల‌ర‌క్త క‌ణాలకు ఇన్‌ఫెక్ష‌న్ సోకుతంది. అది క్ర‌మంగా శ‌రీరం అంతా వ్యాపించి పేగులు, కిడ్నీ, బ్రెయిన్‌ల‌ను దెబ్బ‌తీస్తుంది. ఇది బాగా ముదిరి.. ఇక చికిత్స‌కు కూడా లొంగ‌కుడా ప్రాణాలు తీసేస్తుంది. అయితే ఇది మ‌నుషుల‌ను వ్యాపిస్తుందా అన్న ప్ర‌శ్న ఇప్పుడు చాలా మందికి క‌లుగుతోంది. క‌రోనా కుటుంబ వైర‌స్‌లు కూడా కొన్ని త‌రాల క్రితం గ‌బ్బిలాల నుంచే మ‌నుషుల‌ను సోకాయ‌ని భావిస్తున్నారు.

ఒక‌ప్పుడు కేవ‌లం జంతువుల‌ను మాత్ర‌మే ఎటాక్ చేసే వైర‌స్‌లు ఇప్పుడు మ‌నుషుల‌కూ వ్యాపిస్తున్నాయ‌ని గ‌తేడాది వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ సైతం ప్ర‌క‌టించింది. మ‌రి ఎఫ్ ఐ పీ కూడా పిల్లుల నుంచి మ‌నుషుల‌కు సోకుతుందా అంటే లేద‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్ర‌స్తుతం సిప్ర‌స్‌లో విజృంభిస్తున్న ఈ వైర‌స్ మాన‌వుల‌కు సోక‌ద‌ని.. అయితే ఇది సిప్ర‌స్‌ను పిల్లి శ‌వాల దిబ్బ‌గా మారుస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

సిప్ర‌స్‌లో ప‌రిస్థితి ఎలా ఉంది?

ఎక్కువ‌గా వీధి పిల్లులే ఈ వైర‌స్ బారిన ప‌డుతుండ‌టంతో ఆ కేసుల‌ను న‌మోదు చేయ‌డం.. పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌డం ప్ర‌భుత్వానికి త‌ల‌పోటుగా మారింది. ఒక అంచ‌నా ప్ర‌కారం సిప్ర‌స్‌లో మ‌నుషుల సంఖ్య క‌న్నా పిల్లుల సంఖ్య ఒక 10 ల‌క్ష‌లు ఎక్కువే ఉంటుంది.

ప్ర‌స్తుతానికి మొత్తం పిల్లుల జ‌నాభాలో మూడో వంతు వైర‌స్‌తో బాధ‌ప‌డుతున్నాయ‌ని సిప్ర‌స్ వాయిస్ ఫ‌ర్ యానిమ‌ల్స్ వైస్ ప్రెసిడెంట్ డినోస్ అయిమామ్‌టిస్ వెల్ల‌డించారు. ఈ వైర‌స్ సిప్ర‌స్ నుంచి స‌రిహ‌ద్దు దేశాలైన లెబ‌నాన్‌, తుర్కియే, ఇజ్రాయెల్ దేశాల‌కూ వ్యాపించింద‌ని తెలిపారు.

\

Latest News