Debate | జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ నడుమ 90 మినిట్‌ డిబేట్‌.. ఎప్పుడంటే..!

Debate | మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య పోరు జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు అగ్రరాజ్య రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. సర్వత్రా ఆసక్తి కలిగించే అధ్యక్ష చర్చకు అమెరికాలో రంగం సిద్ధమైంది.

  • Publish Date - June 25, 2024 / 10:09 AM IST

Debate : మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య పోరు జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు అగ్రరాజ్య రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. సర్వత్రా ఆసక్తి కలిగించే అధ్యక్ష చర్చకు అమెరికాలో రంగం సిద్ధమైంది.

ఈ నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బరిలో ఉన్నారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య జూన్‌ 27న మొదటిసారి డిబేట్‌ నిర్వహించనున్నారు.

జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాలపాటు వీరి డిబేట్‌ కొనసాగనుంది. ఈ డిబేట్‌లో పలు కీలక అంశాలపై వారు తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. ట్రంప్‌పై దూకుడైన వైఖరి ప్రదర్శించాలని బైడెన్‌ భావిస్తున్నారు. స్థిరమైన నాయకుడు కావాలో లేదా దోషి కావాలో తేల్చుకోమని ఆయన ప్రజలను కోరనున్నారు. కాగా జో బైడెన్‌ హయాంలో పెరిగిన ధరలు, వలసలను ట్రంప్‌ తన అస్త్రాలుగా చేసుకోనున్నారు.

Latest News