Corrupted SI Arrest | లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ.. పారిపోతుండగా చేజ్ చేసి పట్టుకున్న ఏసీబీ

రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారుల అంతు చూడాలని ఏసీబీ నిర్ణయం తీసుకున్నట్లుంది అనేలా ఆ శాఖ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. లంచగొండి అధికారుల గుండెల్లో నిద్రపోతూ భయం పుట్టిస్తున్నారు.

విధాత, హైదరాబాద్ :

రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారుల అంతు చూడాలని ఏసీబీ నిర్ణయం తీసుకున్నట్లుంది అనేలా ఆ శాఖ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. లంచగొండి అధికారుల గుండెల్లో నిద్రపోతూ భయం పుట్టిస్తున్నారు. అయినా కొందరు కరప్టెట్ ఆఫిసర్స్ మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ఓ పోలీసు అధికారే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. మంగళవారం మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్ఐ రాజేశ్ ఓ రైతు నుంచి లంబం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

వరి కోత మిషన్ కేసు సంబంధించిన విషయంలో రైతు దగ్గర నుంచి ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ రాజేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, ఏసీబీ అధికారుల నుండి తప్పించుకుని ఎస్‌ఐ పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో చేజ్ చేసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో గ్రామ ప్రజలు టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, ఈ తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Latest News