ADG Mahesh Chandra : ఏపీలో 31 మంది మావోయిస్టుల అరెస్ట్

ఏపీలో భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు అరెస్ట్. మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతం. విజయవాడ, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

adg mahesh chandra

విధాత, అమరావతి : కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఏపీ ఇంటలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. అరెస్టయిన వారిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. అలాగే, వారి నుంచి పలు ఆయుధాు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  

మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. ఇవాళ ఉదయం 6.30-7 గంటల మధ్య భద్రత బలగలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు వెల్లడించారు. ఇంటలిజెన్స్ అందించిన సమాచారంతో గాలింపు చర్యలను విస్తృతంగ చేపట్టినట్లు ఏడీజీ తెలిపారు.

విజయవాడలో 27 మంది..

విజయవాడలోని ఓ బిల్డింగ్ లో 27 మంది మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్ ఆక్టోపస్ బృందాలు సోదాలు చేపట్టాయి. అరెస్టయిన వారిలో 9 మంది మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ కార్యదర్శి దేవ్ జీ సెక్యూరిటీ గార్డులు.. మిగిలిన వారు హిడ్మా అనుచరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ ను విడిచి ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చినట్లు తెలుస్తోంది.

Latest News