Maoist Encounter : చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్..ఏడుగురు మావోయిస్టుల హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, కేశ్‌కుతుల్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు (ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు) మృతి చెందారు.

Maoist Encounter

విధాత : ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్ కలకల రేపింది. బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు, ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన మావోయిస్టుల వివరాలను గుర్తించాల్సి ఉందని బస్తర్  రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. మావోయిస్టుల కాల్పుల్లో కానిస్టేబుల్స్ వాడాడి, దుకార్ గోండెలు చనిపోయారని వెల్లడించారు.

‘ఆపరేషన్ కగార్‌’లో భాగంగా భైరామ్‌గఢ్ పరిధిలోని కేశ్‌కుతుల్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయని తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను అడ్డుకుని, ధ్వంసం చేయడానికి దాదాపు 50 మంది మావోయిస్టులు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు వారిపై మెరుపుదాడి దిగాయని వెల్లడించారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డీఆర్‌జీ బృందాలు కూంబింగ్ ఆపరేషన్స్ లో పాల్గొన్నాయని తెలిపారు.

Latest News