Man Lights Fire At Petrol Pump | సిగ‌రెట్ కాల్చొద్ద‌న్నందుకు.. పెట్రోల్ ట్యాంక్‌కు నిప్పు పెట్టిన వ్య‌క్తి.. షాకింగ్ వీడియో

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్‌ (Raipur)లో ఓ వ్య‌క్తి పెట్రోల్ బంక్ (petrol pump)లో సిగ‌రెట్ వెలిగించేందుకు ప్ర‌య‌త్నించాడు. మ‌రో వ్య‌క్తి అత‌న్ని అడ్డుకోవ‌డంతో.. ఏకంగా బైక్ పెట్రోల్ ట్యాంకుకే నిప్పు పెట్టాడు (Man lights fire at petrol pump).

Man Lights Fire At Petrol Pump

Man lights fire at petrol pump | భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం నిషిద్ధం. ముఖ్యంగా పెట్రోల్ బంకుల (petrol pump) వ‌ద్ద అస్స‌లు మంట వెలిగించ‌కూడ‌దు. అయినా కొంద‌రు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పొగ‌తాగుతూ ఇత‌రుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంటారు. తాజాగా ఓ వ్య‌క్తి పెట్రోల్ బంక్‌లో సిగ‌రెట్ వెలిగించేందుకు ప్ర‌య‌త్నించాడు. మ‌రో వ్య‌క్తి అత‌న్ని అడ్డుకోవ‌డంతో.. ఏకంగా బైక్ పెట్రోల్ ట్యాంకుకే నిప్పు పెట్టాడు (Man lights fire at petrol pump).

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్‌ (Raipur)లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 18న రాత్రి సమయంలో ఉర్లా ప్రాంతంలోని పెట్రోల్ బంకు వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. వారిలో ఒక‌రు బైక్‌లోకి పెట్రోల్ పోయిస్తుంటే.. మ‌రో వ్య‌క్తి కింద‌కు దిగాడు. అక్క‌డ సిగ‌రెట్ వెలిగించేందుకు ప్ర‌య‌త్నించాడు. అప్ర‌మ‌త్త‌మైన బైక్‌పై ఉన్న వ్య‌క్తి సిగ‌రెట్ తాగొద్ద‌ని హెచ్చ‌రించాడు. ఆగ్రహించిన ఆ వ్యక్తి పెట్రోల్‌ నింపుతున్న బైక్‌ ట్యాంకులోకి లైటర్‌ విసిరాడు. దీంతో బైక్‌తో పాటు అక్కడ మంటలు ఎగసిపడ్డాయి.

ఈ ఘ‌ట‌న‌తో పెట్రోల్ బంకు సిబ్బంది ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై మంట‌ల‌ను అదుపు చేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది. ఈ ఘ‌ట‌న అనంత‌రం బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డి నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, పెట్రోల్ బంకు సిబ్బంది వారిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ‌య్యాయి. ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి :

Kamareddy BJP Congress clashes| కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య దాడులు.. ఉద్రిక్తత
old tractor sold Viral| లక్కీ మ్యాన్.. పాత ట్రాక్టర్ తో కోటీశ్వరుడయ్యాడు!

Latest News