Old Tractor | లక్కీ మ్యాన్.. పాత ట్రాక్టర్ తో కోటీశ్వరుడయ్యాడు!

ఓ పాత తుప్పు పట్టిన ట్రాక్టర్ ఓ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Old Tractor | లక్కీ మ్యాన్.. పాత ట్రాక్టర్ తో కోటీశ్వరుడయ్యాడు!

విధాత : ఓ పాత తుప్పు పట్టిన ట్రాక్టర్ ఓ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే…ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్‌ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా… ఒక విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడి కంటపడింది. ఆ పాత ట్రాక్టర్ అత్యంత అరుదైన మోడల్ అని గుర్తించిన సదరు వ్యక్తి, దానిని ఏకంగా రూ. 1.25 కోట్లకు కొనుగోలు చేశాడు. దీంతో ఆ పాత ట్రాక్టర్ ఓనర్ కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్టుతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

పంజాబ్‌లోని అమృత్‌సర్ లో ఓ వ్యక్తి వద్ద దశాబ్దాలుగా మూలన పడిఉన్న తుప్పుపట్ట్ిన బ్రిటీష్ కాలం నాటి పాత ట్రాక్టర్ ఉంది. అతను దీనిని యాదృచ్ఛికంగా వీడియో తీసి సరదాగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఒక విదేశీ పురాతన వస్తువుల ప్రేమికుడు ఈ వీడియోలోని పాత ట్రాక్టర్ అరుదైన చరిత్రను, ప్రత్యేకతలను గుర్తించాడు. ఆ పాత ట్రాక్టర్ 1940లకు ముందు మోడల్‌గా గుర్తించి రూ.1.25 కోట్లకు కొనుగోలు చేశాడు. 1920ల నాటి ఈ పాత వింటేజ్ ట్రాక్టర్ ఆవిరితో నడిచే డిజైన్ తో రూపొందించగా..అది ఆనాటి వ్యవసాయ యంత్రాల రూపకల్పనకు, సాంకేతితకు ఇది అరుదైన సాక్ష్యంగా నిలిచింది. మొత్తం మీద ఆ పాత ట్రాక్టర్ యంత్ర లక్ష్మిగా ఇటు కొనుగోలుదారుడికి అరుదైన చారిత్రాక వస్తువును, అమ్మకం దారుడికి ధనలక్ష్మిని అందించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.