వినూత్న పోటీ : ఫోన్ దూరం పెట్టు.. ప్రైజ్ మనీ పట్టు
ప్రస్తుతం ఎవరిని చూసిన వారి చేతిలో ఫోన్ కనిపిస్తుంది. పెద్ద వాళ్ల నుంచి నెలల శిశువు కూడా మొబైల్ ఫోన్ కు ఆకర్షితులయిపోయారు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేవరకు సెల్‌ఫోన్ కు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలో ఫోన్ వ్యసనం నుంచి దూరం చేయడానికి వినూత్నం పోటీని పెట్టారు. ఆ పోటీ గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం ఎవరిని చూసిన వారి చేతిలో ఫోన్ కనిపిస్తుంది. పెద్ద వాళ్ల నుంచి నెలల శిశువు కూడా మొబైల్ ఫోన్ కు ఆకర్షితులయిపోయారు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేవరకు సెల్‌ఫోన్ కు అతుక్కుపోతున్నారు. ఎంతలా అంటే మొబైల్ ఫోన్ శరీరంలో భాగం అయిపోయేంతలా. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ వ్యసనం నుంచి బయటపడేయాలని పంజాబ్ లోని మెగా జిల్లాలోని మెగా ఖుర్దు గ్రామంలోని కొందరు వినూత్నం ప్రయత్నం మొదలు పెట్టారు.
గ్రామంలోని చిన్నారులు, యువత, పెద్దల్లో పెరుగుతున్న మొబైల్ అలవాటును చూసి ఆందోళన చెందిన గ్రామ పెద్దలు, కొందరు స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ‘గ్రేట్ సిట్టింగ్ ఛాలెంజ్’ (no phone sitting challenge) పేరుతో ఈ పోటీని నిర్వహించాలని నిర్ణయించారు. పోటీ నియమాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. పాల్గొనేవారు మొబైల్‌ను పూర్తిగా పక్కన పెట్టి, ఒకే చోట కదలకుండా కూర్చోవాలి. నిద్రపోవడం, ఫోన్ చూడడం, వాష్‌రూమ్‌కు వెళ్లడం నిషేధం. అయితే ఆకలి, దాహం వేస్తే అక్కడికే నీరు, భోజనం అందజేస్తారు. ఎక్కువసేపు ఫోన్ లేకుండా కూర్చోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు.
పంజాబ్‌లోని పిల్లలు, యువకులు, పెద్దలు మాత్రమే ఈ పోటీకి అర్హులు. గెలిచిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు సిద్ధంగా ఉన్నాయి. మొదటి బహుమతి విజేతకు సైకిల్‌తో పాటు రూ.4,500, రెండో బహుమతిగా రూ.2,500, మూడో బహుమతిగా రూ.1,500 అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కాగా, ఫోన్‌లకు అతుక్కుపోయి, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా సమయం లేకుండా పోయిందనే ఆలోచనే ఈ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచింది. మొబైల్ వ్యసనాన్ని తగ్గించి, మళ్లీ మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా చేయాలన్నదే ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తొలి పోటీలో 55 మంది పాల్గొన్నారు. ఎవరు చివరి వరకు నిలబడతారో చూడటానికి గ్రామస్థులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఈ పోటీలు నిర్వహించడంపై పలువురు ఖుర్దా గ్రామస్తులతో పాటు నిర్వాహకులను పలువురు అభినందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఫోన్ల నుంచి దూరం ఉండగలం అనే నమ్మకం ప్రజల్లో కలుగుతుందంటున్నారు. మనకు అవసరమైన పనుల కోసమే మొబైల్ ను ఉపయోగించుకోవాలి తప్పా.. వ్యసనం లాగా మార్చుకుని సెల్ ఫోను ఉచ్చులో పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా ఫోన్ ను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్యం సమస్యలతో పాటు మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
Also Read-Ravi Teja| రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ‘బెల్లా బెల్లా’ సాంగ్
CM Revanth Reddy | గ్రామాన్ని అభివృద్ధి చేసేవాళ్లనే సర్పంచ్‌గా గెలిపించుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
Tenant Farmer Suicide| కౌలు రైతు ఆత్మహత్య..సెల్పీ వీడియో వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram