Old Tractor | లక్కీ మ్యాన్.. పాత ట్రాక్టర్ తో కోటీశ్వరుడయ్యాడు!
ఓ పాత తుప్పు పట్టిన ట్రాక్టర్ ఓ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విధాత : ఓ పాత తుప్పు పట్టిన ట్రాక్టర్ ఓ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే…ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్‌ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా… ఒక విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడి కంటపడింది. ఆ పాత ట్రాక్టర్ అత్యంత అరుదైన మోడల్ అని గుర్తించిన సదరు వ్యక్తి, దానిని ఏకంగా రూ. 1.25 కోట్లకు కొనుగోలు చేశాడు. దీంతో ఆ పాత ట్రాక్టర్ ఓనర్ కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్టుతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
పంజాబ్‌లోని అమృత్‌సర్ లో ఓ వ్యక్తి వద్ద దశాబ్దాలుగా మూలన పడిఉన్న తుప్పుపట్ట్ిన బ్రిటీష్ కాలం నాటి పాత ట్రాక్టర్ ఉంది. అతను దీనిని యాదృచ్ఛికంగా వీడియో తీసి సరదాగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఒక విదేశీ పురాతన వస్తువుల ప్రేమికుడు ఈ వీడియోలోని పాత ట్రాక్టర్ అరుదైన చరిత్రను, ప్రత్యేకతలను గుర్తించాడు. ఆ పాత ట్రాక్టర్ 1940లకు ముందు మోడల్‌గా గుర్తించి రూ.1.25 కోట్లకు కొనుగోలు చేశాడు. 1920ల నాటి ఈ పాత వింటేజ్ ట్రాక్టర్ ఆవిరితో నడిచే డిజైన్ తో రూపొందించగా..అది ఆనాటి వ్యవసాయ యంత్రాల రూపకల్పనకు, సాంకేతితకు ఇది అరుదైన సాక్ష్యంగా నిలిచింది. మొత్తం మీద ఆ పాత ట్రాక్టర్ యంత్ర లక్ష్మిగా ఇటు కొనుగోలుదారుడికి అరుదైన చారిత్రాక వస్తువును, అమ్మకం దారుడికి ధనలక్ష్మిని అందించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తుప్పు పట్టిన పాత ట్రాక్టర్ కు రూ. 1.50 కోట్లు వచ్చాయి అంటున్న వ్యక్తి.
ఇది యాంటిక్ పీస్ అని అందుకే ఇంత డబ్బులు వచ్చాయి అంటున్న వ్యక్తి. pic.twitter.com/X4A58rRR9b
— UttarandhraNow (@UttarandhraNow) February 20, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram