• Telugu News
  • /National

Tarn Taran Law College : క్లాస్ రూమ్ లోనే తోటి విద్యార్థిని గన్ తో కాల్చి విద్యార్థి ఆత్మహత్య

పంజాబ్‌లో లా కాలేజీలో సంచలనం. క్లాస్‌రూమ్‌లోనే తోటి విద్యార్థిని కాల్చి చంపిన విద్యార్థి ఆత్మహత్య. ప్రేమ వ్యవహారం కారణమని అనుమానం.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 09, 2026, 2:48 pm IST
Read Time: 3 mins
Tarn Taran Law College : క్లాస్ రూమ్ లోనే తోటి విద్యార్థిని గన్ తో కాల్చి విద్యార్థి ఆత్మహత్య

న్యూఢిల్లీ : పట్టుమని 20ఏళ్లు కూడా లేని విద్యార్థిని విద్యార్ధుల మధ్య నెలకొన్న మనస్పర్థలు వారిద్దరి విలువైన ప్రాణాలను బలితీసుకున్నాయి. పంజాబ్ లోని తరుణ్ తరుణ్ లో లా కాలేజీలోని తరగతి గదిలోనే తోటి విద్యార్ధిని గన్ తో కాల్చి చంపిన విద్యార్ధి తర్వాత తను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు నెట్టింటా వైరల్ గా మారాయి.

ప్రిన్స్ రాజ్(19) అనే విద్యార్థి తోటి విద్యార్థినైన సందీప్ కౌర్(18)ని క్లాస్ రూమ్ లోనే గన్ తో పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపాడు. ఆ వెంటనే అతను కూడా అదే గన్ తో తలకు గురి పెట్టుకుని కాల్చుకుని చనిపోయాడు. కాల్పుల ఘటనలో ఇద్దరు స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో క్లాస్ రూమ్ లోని మిగతా విద్యార్ధులు భయంతో భయటకు పరుగులు తీశారు. ప్రేమ వ్యవహారమే ఈ దారుణ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అయితే 19ఏళ్ల విద్యార్థికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది చర్చనీయాంశమైంది. ఈ ఘటన పంజాబ్ లో గన్ కల్చర్ సమస్యను చాటుతుందని విమర్శలు వినవస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

No Confidence Motion Against Om Birla : స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాల అవిశ్వాసం ?
Techie safety allegation| కోటి సంపాదించే టెకీ జీవితానికి విలువ ఎక్కడా..?