Ravi Teja| రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ‘బెల్లా బెల్లా’ సాంగ్
రవితేజ ( హీరోగా దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి మేకర్స్ తొలి పాట ‘బెల్లా బెల్లా’ ను విడుదల చేశారు. రవితేజ, ఆషికా రంగనాథ్ కాంబినేషన్‌లో రూపొందిన పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు
విధాత : రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahashayulaku Vignapthi) నుంచి మేకర్స్ తొలి పాట ‘బెల్లా బెల్లా’ (Bella Bella song)ను విడుదల చేశారు. రవితేజ, ఆషికా రంగనాథ్(Ashika Ranganath) కాంబినేషన్‌లో రూపొందిన పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సురేష్ గంగులా సాహిత్యం అందించగా.. నాకాశ్ అజీజ్,రోహిణి సోరాత్ కలిసి పాడారు. పాటలో రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, గ్లామర్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ అందంగా కనిపించింది. స్పెయిన్‌లో ఈ పాట చిత్రీకరించారు.ఈ సినిమాలో డింపుల్ హయాతి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఇటీవలే మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా క్రేజీ రెస్పాన్స్ దక్కించుకుంది. జయపజయాలతో నిమిత్తం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రవితేజ బిజీగా ఉన్నారు. అంతేస్థాయిలో వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటన్నప్పటికి తన జోరు మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే మాస్ జాతరతో వచ్చిన రవితేజ ప్రేక్షకుల్ని మెప్పించడంతో విఫలమయ్యాడు. ఈ దఫా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో.. తనకి అచ్చొచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ జోనర్ లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ఆడియన్స్ని పలకరించనున్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram