Gold, Silver price hike| యుద్ధం ఎఫెక్ట్…పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పై యుద్దం చేస్తున్న నేపథ్యంల.. బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమవుతంది. బులియన్ మార్కెట్ లో 10గ్రాముల 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.4,370 పెరిగి... రూ.1, 73, 080 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 4000పెరిగి రూ.1,58,650 వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు సైతం అనూహ్యంగా రూ.5వేలు పెరిగింది. ఆదివారం కిలో వెండి ధర రూ. 3,25,000లకు చేరింది. యుద్దం ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు ఉన్నాయని మార్కెట నిపుణులు చెబుతున్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Mar 01, 2026, 12:21 pm IST
Read Time: 3 mins
Gold, Silver price hike| యుద్ధం ఎఫెక్ట్…పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

విధాత: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్దంతో పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విలువైన లోహాలు బంగారం, వెండి వంటి ధరలపై యుద్దం ప్రభావం చూపుతుంది.

శనివారం సాయంత్రం తులం బంగారంపై రూ.7,140పెరిగిన బంగారం ఆదివారం మరోసారి రూ.4,370 పెరిగి రూ.1, 73, 080 వద్ద కొనసాగుతుంది. బులియన్ మార్కెట్ లో  24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర  రూ.1,73,080 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 4000పెరిగి రూ.1,58,650 వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలు సైతం అనూహ్యంగా రూ.5వేలు పెరిగింది. ఆదివారం కిలో వెండి ధర రూ. 3,25,000లకు చేరింది.

యుద్దంతో బంగారం, వెండి ధరలకు హైప్

అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్దం చేస్తుండటం..ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమవ్వడంతో యుద్దం మరింత తీవ్రతరం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. యుద్దం ప్రభావంతో అంతర్జాతీయంగా బంగారం ధర. 5250 డాలర్ల వద్ద ఒక నెల గరిష్టానికి చేరింది. ఆల్-టైమ్ హై 5602.23 డాలర్లను చేరడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారులు యుద్ద పరిస్థితుల మధ్య బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించి, బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధరలు సరికొత్త రికార్డు పెరుగుదల దిశగా సాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.