Israel Iran War| గుండెల్ని పిండేసే దృశ్యం..ఇజ్రాయెల్ దాడిలో 108మంది విద్యార్థినుల మృతి
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ దేశం భారీ విధ్వంసం..ప్రాణ నష్టానికి గురువుతుంది. ముఖ్యంగా ఇరాన్‌లోని మినాబ్‌లో షజారా తయ్యాబా బాలికల పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో దాదాపు 108 మంది విద్యార్థినిలు మృతి చెందిన ఘటన యుద్దంలో తీవ్ర విషాద ఘటనగా మిగిలింది.
విధాత : అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ దేశం భారీ విధ్వంసం..ప్రాణ నష్టానికి గురువుతుంది. ముఖ్యంగా ఇరాన్‌లోని మినాబ్‌లో షజారా తయ్యాబా బాలికల పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో దాదాపు 108 మంది విద్యార్థినిలు మృతి చెందిన ఘటన యుద్దంలో తీవ్ర విషాద ఘటనగా మిగిలింది.
యుద్దం ఎవరికోసం, ఎందుకోసం జరుగుతుందో తెలియని అమాయక విద్యార్థులు ఇజ్రాయెల్ దాడికి రక్తపు ముద్దలుగా మారిపోయారు. ఘటన స్థలంలో ఎటు చూసినా విద్యార్థినిల రక్తంతో తడిసిన బ్యాగులు, చిరిగిన పుస్తకాలతో బీభత్సంగా కనిపించింది. తమ బిడ్డల ఆనవాళ్లను వెతుక్కుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్న తల్లిదండ్రుల రోధనలతో ఈ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో 108మంది విద్యార్ధినిలతో పాటు ఇరాన్‌లో మొత్తం 300మందికి పైగా ఇప్పటికే మరణించారు. 800మందికి పైగా గాయపడ్డారని రెడ్ క్రెసెంట్ వెల్లడించింది. ఈ యుద్దంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబంతో సహ మరణించారు. ఇరాన్ ప్రతి దాడుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) ఒకరు మృతి చెందారు. ఇజ్రాయెల్‌లో 94 మంది గాయపడ్డారు. యుద్ధం మొదలు కావడంతో పశ్చిమాసియా దేశాల గగన తలాలు మూసివేయడంతో ఆ దేశాలకు రాకపోకలు సాగించే వేలకొద్దీ విమానాలు రద్దయ్యాయి.
ఆ దేశాల్లో 10కోట్ల మంది భారతీయులు
10 కోట్ల మంది భారతీయులు దుబాయ్, మిడిల్ ఈస్ట్‌లో ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో 94 లక్షల మంది భారతీయులు విమానాల రాకపోకల నిలిపివేత..యుద్దం పరిణామాల మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లు ధ్వంసం.. విమాన సర్వీసులు రద్దు కావడంతో యూఏఈలో అత్యధికంగా 38.9 లక్షలు, సౌదీలో 26.5 లక్షల మంది భారతీయుల ఆందోళనలో పడిపోయారు. తెలంగాణ నుంచి 16 లక్షలు, ఏపీ నుంచి 15 లక్షల మంది వలస కార్మికులు యుద్ద పరిస్థితులతో అల్లాడిపోతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయిన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ఖాళీ చేయించారు. మిస్సైల్ దాడితో ఖలీఫా భవనంలో మంటలు చెలరేగాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా అందులో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. దుబాయ్, అబుదాబి, ఖతార్, రియాద్‌లపై ఇరాన్ దాడులకు దిగింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి చేయగా, దుబాయ్‌లోని అట్లాంటిస్ హోటల్‌పై మిస్సైల్ దాడి జరిగింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram