Virsoh | విరోష్ పెళ్లి కానుకగా దేశవ్యాప్తంగా స్వీట్లు, గుళ్లలో అన్నదానం .. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్
Virsoh | ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహంతో టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం అభిమానులకు ప్రత్యేక కానుక ఇవ్వాలని నిర్ణయించిన ఈ ‘విరోష్’ జోడీ దేశవ్యాప్తంగా స్వీట్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
Virsoh | ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహంతో టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం అభిమానులకు ప్రత్యేక కానుక ఇవ్వాలని నిర్ణయించిన ఈ ‘విరోష్’ జోడీ దేశవ్యాప్తంగా స్వీట్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. తమ వివాహ వేడుకను అభిమానులతో పంచుకోవాలని భావించిన విజయ్, రష్మిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
మా ప్రయాణంలో, మా ప్రేమలో ఈ దేశ ప్రజలు ఎల్లప్పుడూ భాగమయ్యారు. మా జీవితంలోని ఈ ప్రత్యేక క్షణాన్ని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. భారతదేశంలో ప్రతి శుభకార్యాన్ని స్వీట్లు, ఆహారంతో జరుపుకుంటాం అని వారు పేర్కొన్నారు.
మార్చి 1న స్వీట్ ట్రక్కులు..
మార్చి 1న దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో అభిమానులకు స్వీట్లు పంపిణీ చేయనున్నారు. ప్రేమ, కృతజ్ఞతలతో నిండిన స్వీట్ ట్రక్కులను పలు రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు ఈ జంట తెలిపింది.
స్వీట్లు పంపిణీ చేయనున్న రాష్ట్రాలు: ఢిల్లీ, బీహార్, తెలంగాణ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి.
తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ ప్రాంతాల్లో స్వీట్లు పంచనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, పుట్టపర్తిలో అభిమానులకు ఈ స్వీట్ కానుక అందించనున్నారు.
దేవాలయాల్లో అన్నదానం
అభిమానుల ఆశీర్వాదాలు కోరుతూ పలు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో అన్నదానం కూడా నిర్వహించనున్నారు. తెలంగాణలోని చింతపల్లి సాయిబాబా టెంపులః్, మన్యం కొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం, హరే కృష్ణ హరిటేజ్ దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కనకమహాలక్ష్మీ ఆలయం, ద్వారకా తిరుమల ఆలయం, కనకదుర్గ ఆలయంలలో అన్నదానం చేయనున్నారు.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుక అనంతరం, మార్చి 4న హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.పెళ్లి తర్వాత ఢిల్లీకి వెళ్లిన ఈ జంట, రిసెప్షన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే విరోష్ జంట నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram