Tenant Farmer Suicide| కౌలు రైతు ఆత్మహత్య..సెల్పీ వీడియో వైరల్
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కౌలు రైతు ఆత్మహత్య సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న వ్యవసాయంలో అప్పుల పాలై...కౌలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఆత్మహత్య చేసుకునేముందు ఓ సెల్పీ వీడియో విడుదల చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విధాత, హైదరాబాద్ : ఖమ్మం జిల్లాKhammam District నేలకొండపల్లి కౌలు రైతు ఆత్మహత్య(Tenant Farmer Suicide) సెల్ఫీ వీడియో వైరల్( selfie video viral)గా మారింది. నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న(Banothu Veeranna) వ్యవసాయంలో అప్పుల పాలై…కౌలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఆత్మహత్య చేసుకునేముందు ఓ సెల్పీ వీడియో విడుదల చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కౌలురైతు వీరన్న ఆత్మహత్యపై బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) స్పందించారు. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనం అని ఎక్స్ వేదికగా విమర్శించారు. రైతుభరోసా ఇస్తామని చెప్పి, నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం అని, ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యనే అని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం అని హరీష్ రావు విమర్శించారు. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు? అని ప్రశ్నించారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి… ఎవరూ అధైర్యపడకండి అని హరీష్ రావు అన్నారు.
కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న… pic.twitter.com/sJ7f9pUjUY
— Harish Rao Thanneeru (@BRSHarish) December 1, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram